Monday, May 6, 2024

అంబులెన్స్‌ను బాగు చేయ‘రూ’.. !

- Advertisement -
- Advertisement -

బాసర : బాసర అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు గ్రామస్తులకు ఆరోగ్య పరంగా సమస్యలు ఎదురైతే ఉపయోగపడేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. అయితే ఓ రహదారి ప్రమాదంలో దాని ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. అప్పటి నుంచి నేటికి మరమ్మతులు లేక మూలకు చేరింది. బాసరకు వచ్చిన సందర్భంలో మంత్రి హరీశ్‌రావుకు యువకులు, గ్రామస్తులు విన్నవించగా ప్రత్యేకంగా అంబులెన్స్‌ను పంపించారు.

ఆరు నెలల కిందట ఓ భక్తుడిని నిజామాబాద్ ఆసుపత్రి తరలిస్తున్న క్ర మంలో అంబులెన్స్ డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనానికి బీమా పత్రాలు లేవు. దాని మర మ్మతులకు దాదాపు రూ. లక్ష పైనే ఖర్చుకానుండడంతో డబ్బులు లేక ఆసుపత్రిలోని ఓ మూలన పెట్టారు. అప్పటి నుంచి ముథోల్, భైంసా నుంచి అంబులెన్స్‌లు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి అందుబాటులో లేకపోతే నిజామాబాద్ జిల్లా నవిపేట్, రెంజర్ల నుంచి అంబులెన్స్ రావాలి. అవి రావాలంటే సుమారు అరంగంటపైనే సమయం పడుతుండగా రోగిని ఆసుపత్రికి తరలించాలంటే గంటల సమయం పడుతోంది. ఇప్ప టికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే అంబులెన్స్‌కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News