Wednesday, May 15, 2024

పండుగల దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో జనం గుమి కూడడంపై పరిమితులు

- Advertisement -
- Advertisement -

Restrictions on crowding in public places for festivals

 

కొవిడ్ కేస్లు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాబోయే పండగల సీజన్‌లో స్థానికంగా జనం భారీ సంఖ్యలో గుమి కూడకుండా స్థానికంగా, ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించాలని, వారి సంఖ్యను పరిమితం చేయడం లేదా, పూర్తిగా నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖలో అదనపు కార్యదర్శి ఆర్తి ఆహుజా బుధవారం రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులకు లేఖలు రాశారు. కొవిడ్19పై పోరు ప్రస్తుతం కీలక దశలో ఉందని, ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో హోలి, షబ్‌ఎబారాత్, బిహు, ఈస్టర్, ఈదుల్ ఫితర్ లాంటి పండుగలు రానున్న దృష్ట్యా పండుగల్లో జనం పెద్ద సంఖ్యలో చేరడంపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలించాలని, విపత్తుల నిర్వహణ చట్టంలోని సెక్షన్ 22 కింద తమకు ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ సంఖ్యను పరిమితం చేయడం లేదా నిషేధించే విషయాన్ని పరిశీలించాలని ఆర్తి ఆహుజా ఆ లేఖలో కోరారు. ప్రస్తుత దశలో కొవిడ్ వ్యాప్తి కట్టడికి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే వైరస్ కట్టడిలో ఇప్పటివరకు సాధించిన ప్రయోజనాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతాయని ఆమె ఆ లేఖలో సేర్కొన్నారు. అందువల్ల వైరస్ వ్యాప్తి గొలుసును తెంచడానికి, దేశంలో కేసుల సంఖ్యను తగ్గించడానికి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆ లేఖలో స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News