Monday, April 29, 2024

8-10 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్ జిఎస్‌టి పరిధిలోకి అసాధ్యం

- Advertisement -
- Advertisement -

Petrol and diesel are not covered under GST for 8-10 years

 

బిజెపి ఎంపి సుశీల్‌మోడీ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ను మరో 8-10 ఏళ్ల వరకు జిఎస్‌టి పరిధిలోకి తేవడం కుదరదని బిజెపి సీనియర్ నేత సుశీల్‌కుమార్‌మోడీ అన్నారు. జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ఏటా రాష్ట్రాలు రూ.2 లక్షల కోట్లమేర కోల్పోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఏటా రూ.5 లక్షల కోట్లమేర పన్నుల రూపంలో పొందుతున్నాయని ఆయన తెలిపారు. బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న సుశీల్‌మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంగా పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూ, ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో లీటర్ రూ.100కు చేరువయ్యాయి. దాంతో, ప్రతిపక్షాల నుంచి కేంద్రంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని సమర్థిస్తూ సుశీల్‌మోడీ వివరణ ఇచ్చారు. మరోవైపు బుధవారం ఓమేరకు ధరలు తగ్గించారు. పెట్రోల్‌పై 18పైసలు, డీజిల్‌పై 17పైసలు తగ్గించారు. దాంతో, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.99కి, డీజిల్ ధర రూ.81.30కి దిగి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News