Saturday, May 4, 2024

బిఆర్ఎస్, బిజెపి.. డబ్బు చూసి అభ్యర్థులను ప్రకటించాయి: రేవంత్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్, బిజెపి పార్టీలు.. డబ్బును చూసి అభ్యర్థులను ఎంపిక చేశాయని టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారి వద్ద డబ్బులు ఉంటే..కాంగ్రెస్ వద్ద ఓట్లు ఉన్నాయని అన్నారు. బుధవారం ఖానాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్ కు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం పాల్గొని మాట్లాడారు.

“ఆదిలాబాద్ ను సస్యశామలం చేసేందుకు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు ప్రతిపాదించాం. బిఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు నిర్వాహణ చేయలేకపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు, పేదలకు భూములు ఇస్తే.. ధరణి తెచ్చి కేసిఆర్ పేదల భూములను గుంజుకున్నారు. రైతులను బిఆర్ఎస్ నిండా ముంచింది. కాంగ్రెస్ రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. ప్రత్యేక నిధులు కేటాయిస్తాం.

ధరణి లేకపోతే రైతుబంధు రాదని కేసీఆర్ చెబుతున్నారు.. రైతుబంధు వచ్చింది 2018లో.. ధరణి తెచ్చింది 202లో. 2018 నుంచి 2020 వరకు ధరణి లేకుండానే రైతుబంధు ఎలా వచ్చింది?. బిఆర్ఎస్ నేతలు ధరణి తెచ్చి దందాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరింత మెరుగైన పోర్టల్ ను తీసుకొస్తాం. ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదాలను పరిష్కరిస్తాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News