Saturday, May 4, 2024

బ్రిటన్ ప్రధాని ఎన్నికల రేసు… టాప్ 3 లో టాప్ రిషి సునాక్

- Advertisement -
- Advertisement -

Rishi Sunak tops new UK PM vote as

తాజా రౌండ్ లోనూ విజయం

లండన్ : బ్రిటన్ ప్రధాని పదవికి జరుగుతున్న పోరులో భారత మూలాలున్న రిషి సునాక్ తాజాగా జరిగిన నాలుగో రౌండ్ లోనూ అత్యధిక మెజారిటీ సాధించారు. రెండో స్థానంలో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ , మూడో స్థానంలో విదేశాంగ మంత్రి లిజ్ ట్రూజ్‌లు కొనసాగుతున్నారు. తాజా రౌండ్ నుంచి కెమి బడెనోచ్ ఎలిమినేట్ కావడంతో ప్రధాని పోటీలో ముగ్గురే నిలిచారు. ఈ టాప్ త్రీ లోనూ రిషి సునాక్ అగ్రస్థానంలో కొనసాగుతుండడం ప్రధాని పదవిపై మరిన్ని ఆశలు రేకెత్తిస్తున్నాయి. కన్సర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు మంగళవారం మరోదఫా వడపోత ఎన్నిక జరిగింది. ఇందులో రిషి సునాక్ కు 118 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు 92 ఓట్లు రాగా, మూడో స్థానంలో ఉన్న లిజ్‌ట్రూజ్ 86 ఓట్లతో సరిపెట్టుకున్నారు.

ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న కెమి బడెనోచ్‌కు కేవలం 59 ఓట్లు రావడంతో ప్రధాని పదవి పోటీ నుంచి ఆమె తప్పుకోవలసి వచ్చింది. ఇలా గురువారం జరిగే చివరి రౌండ్ నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. తుది రౌండ్‌లో నిలవాలంటే 120 ఓట్లు అవసరం. అయితే ఇప్పటివరకు కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు (టోరీ ఎంపీలు) మాత్రమే ఈ ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత తుది అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్ పార్టీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. తుది పోరులో గెలిచిన వ్యక్తిని సెప్టెంబర్ 5 న ప్రకటిస్తారు. ఇలా కన్సర్వేటివ్ పార్టీ నేతగా విజయం సాధించేవారే బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News