Friday, May 17, 2024

‘కార్తికేయ 2’కు దక్కిన అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న కార్తికేయ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా కార్తికేయ 2 చిత్ర యూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ నుంచి ఆహ్వానం లభించింది. భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం ‘కార్తికేయ 2’ టీంను వరించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

Iskcon Vice President invites ‘KARTIKEYA 2′ Unit’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News