Saturday, May 4, 2024

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పెరుగుతున్న ర్యాపిడ్ టెస్టులు

- Advertisement -
- Advertisement -

Rising Rapid Tests in Urban Health Centers

హైదరాబాద్: నగరంలో కరోనా త్వరగా గుర్తించేందుకు వైద్యశాఖ ఉచితంగా నిర్వహించే ర్యాపిడ్ టెస్టులకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చలికాలం కావడంతో చాలామంది జలుబు, దగ్గు లక్షణాలతో వస్తున్నట్లు, రోజుకు 50నుంచి 80మంది పరీక్షల కోసం జనం బారులు కడుతున్నట్లు ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పేర్కొంటున్నారు. జూలై 11వ తేదీన నుంచి నగరంలో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. రోజుకు 25మందికి పరీక్షలు చేసి ఆరగంటలో ఫలితం వెల్లడించాలి.కానీ గత వారం రోజుల నుంచి వైద్యంకోసం వచ్చేవారి సంఖ్య పెరిగిందంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో చాలా తక్కువమంది వచ్చారని, చలికాలం ప్రారంభం కావడంతో మళ్లీ వైరస్ విజృంభణ చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

వచ్చే మూడు నెలల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోన బారి నుంచి తప్పించుకోవచ్చని రాష్ట్ర వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించిన టెస్టులు చేసుకుంటున్నారని,సీజనల్ వ్యాధులు వచ్చిన వారికి కూడా ఇదే విధంగా లక్షణాలు ఉండటంతో రోగులు ఆరోగ్య కేంద్రాల వద్ద గంటల తరబడి ఉంటూ పరీక్షలు చేసుకున్నట్లు కేంద్రాలు సిబ్బంది చెబుతున్నారు. నాలుగు నెలల్లో ర్యాపిడ్ టెస్టులు 6.80లక్షలు చేసినట్లు,రోజుకు 8వేలమందికి టెస్టులు చేశామని, వారం రోజుల నుంచి జనాలు తరలివస్తుంటే, డిసెంబర్‌లో టెస్టుల కోసం పెద్ద ఎత్తున జనం వచ్చే పరిస్దితి కనబడుతుందని, ఈసారి వర్షాలు భారీగా కురువడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని,దీంతో జలుబు, దగ్గు,జ్వరం, మలేరియా, టైపాయిడ్ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని జిల్లా వైద్యశాఖ అంచనా వేస్తున్నారు. అందుకోసం సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అదే విధంగా కరోనా సేకండ్ వేవ్ ముప్పు ఉందని, ఇప్పటికే పలు దేశాలను వణికిస్తుంది.

మళ్లీ హైదరాబాద్ నగరంపై విరుచుకపడే ప్రమాదం ఉందని, మార్చి నుంచి నమోదైతున్న పాజిటివ్ కేసులో అత్యధికంగా మహానగరం నుంచే బయటపడుతున్నాయి. రెండోదశలో కూడా భాగ్యనగరంపై వైరస్ పంజా విసురుతుందనే ప్రచారంతో ప్రజలు అప్రమత్తమైతున్నారు. ఈసారి వైరస్ బారిన పడితే కోలుకోవడం కష్టమని, ముందు జాగ్రత్తలో భాగంగా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు వెళ్లుతూ ఆరోగ్యం కాపాడుకునే పనిలో ఉన్నారని వైద్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. మరో పక్క స్వైప్లూ ముప్పు కూడ ఉన్నట్లు, గత మూడు నెలలుగా 15వేలు స్వైన్‌ప్లూ కేసులు, చలి తీవ్రతకు పెరిగే చాన్స్ ఉందని, సంక్రాంతివరకు ప్రజలకు కరోనా, స్వైన్‌ప్లూ ఇబ్బందులు తప్పవని, వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, వ్యక్తుల మధ్య అరు అడుగుల భౌతికదూరం, బయటకు వెళ్లితే ఎప్పటికప్పడు శానిటైజర్ వినియోగిస్తే కరోనా వైరస్ దరి చేరకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని, నిర్లక్షం చేస్తే మహమ్మారి కబలిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News