Wednesday, May 1, 2024

చెలరేగిన హిట్ మ్యాన్; గేల్ రికార్డులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

హిట్ మాన్ రోహిత్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు. న్యూజీలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 47 పరుగులు చేసి, పవర్ ప్లేలో తడాఖా చూపాడు. వ్యక్తిగత రికార్డుల గురించి రోహిత్ పట్టించుకోడనీ, జట్టుకు శుభారంభం ఇచ్చేందుకే ప్రయత్నిస్తాడనీ ఇటీవల లిటిల్ మాస్టర్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తూ, చక్కటి శుభారంభాన్ని అందించాడు.

ఈ క్రమంలో గతంలో వెస్టీండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రెండు రికార్డులను రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఒక ప్రపంచ కప్ లో అత్యధిక సిక్సర్లు చేసిన బ్యాటర్ గా గేల్ పేరిట రికార్డు ఉంది. 2015 ప్రపంచ కప్ టోర్నీలో గేల్ 26 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డును రోహిత్ అధిగమించాడు. న్యూజీలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అతను నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఈ ప్రపంచ కప్ లో అతను కొట్టిన సిక్సర్ల సంఖ్య 27కు చేరింది. అలాగే ప్రపంచ కప్ చరిత్రలో గేల్ 49 సిక్సర్లు కొట్టగా, ఆ రికార్డును కూడా రోహిత్ దాటేశాడు. ఇప్పటివరకూ రోహిత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 50 కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News