Sunday, May 12, 2024

హైద‌రాబాద్ వీధుల్లో ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ చక్కర్లు.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ సందడి చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన హాలీవుడ్ బ్యాటీ ఒలీవియా మోరిస్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అనురెడ్డితో కలిసి శనివారం సాయంత్రం నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ.. పానీ పూరీ తింటూ సందడి చేసింది. దీంతోపాటు శిల్పారామం వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఒలీవియా తన ఇస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఒలీవియా నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు మూడు చిన్న సీన్స్ తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తైందని ఇటీవల మూవీ మేకర్స్ వెల్లడించారు.

RRR Actress Olivia visit Shilparamam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News