Monday, May 6, 2024

మెడికల్ కళాశాలకు రూ.150 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః జగిత్యాల మెడికల్ కళాశాల అభివృద్ధికి రూ.150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరగ పనులు మొత్తం పూర్తి చేయాలని అధికారులను జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ ఆదేశించారు. జగిత్యాల పట్టణంలోని మెడికల్ కళాశాల చుట్టూ నలువైపులా రహదారుల అభివృద్ధిలో భాగంగా చిన్న కెనాల్ నుంచి రామాలయం వరకు రోడ్డు నిర్మాణం, బస్ డిపో నుంచి మాతా శిశు సంరక్షణ కేంద్రం వరకు బిటి రోడ్డు, నటరాజ్ చౌరస్తా నుంచి బసవేశ్వర విగ్రహం వరకు బిటి రోడ్డు, ఐడిఓసి నుంచి అంతర్గాం రోడ్డు వరకు నాలుగు లైన్‌ల బిటి రోడ్డు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.11 కోట్ల 15 లక్షతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు.

Also Read: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు!

ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు మెడికల్ కాలుజి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రూ.11 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం హర్షణీయమని ఎంఎల్‌ఎ తెలిపారు. జిల్లా నడి బొడ్డున రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు. సిటిస్కాన్, డయాగ్నొస్టిక్ కేంద్రం, రేడియాలజీ కేంద్రం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగం ఉంటుందని, జగిత్యాల మెడికల్ హబ్‌గా మారిందన్నారు. నేటి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి చుట్టు పక్కల జిల్లా ల నుంచి సైతం ప్రజలు వస్తున్నారన్నారు. గత పాలకు నిర్లక్ష్యం వల్లనే యావర్ రోడ్డు వెడల్పులో అడ్డంకులు ఏర్పడ్డాయని,

1000 మీటర్ల పొడవునా, ప్రభుత్వ స్థలాలు వెడల్పు చేసి, అదునాతన డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు ఒద్ది శ్రీలతరామ్మోహన్‌రావు, జుంబర్తి రాజ్‌కుమార్, పట్టణ పార్టీ కార్యదర్వి ప్రశాంత్‌రావు, ఎఫ్‌సిఎస్ డైరెక్టర్ ఆరుముళ్ల పవన్, బింగి రాజేశం, వొంటిపులి రాము, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News