Sunday, April 28, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న దాదాపు నాలుగు కేజీల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. డర్బన్ నుంచి ఢిల్లీకి వచ్చిన టాంజానియా దేశస్తుడి నుంచి హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన హ్యాండ్, ట్రాలీ బ్యాగుల్లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి హెరాయిన్ నింపి తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. హెరాయిన్ విలువ సుమారు రూ.28 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Rs 28 Crore Worth Heroin seized in Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News