Friday, May 10, 2024

తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.544కోట్లు జమ

- Advertisement -
- Advertisement -

Rs 544 crore was deposited in Farmers accounts on first day

మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్‌కు సంబంధించిన నగదు సాయం (రైతుబంధు) రాష్ట్ర రైతుల ఖాతాల్లో తొలిరోజు జమ అయ్యిందని, మొదటిరోజు 18 లక్షల 12 వేల 656 మంది రైతుల ఖాతాలో రూ.544.55 కోట్లు నగదు వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. యాసంగి సీజన్‌లో లబ్ధిదారుల సంఖ్య 66.61 లక్షలకు పెరగ్గా రూ.7,645 కోట్లకు పైగా సాయం అందనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి, దేశానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒక దిక్సూచిగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తోన్న వ్యవసాయ అనుకూల పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని మంత్రి కొనియాడారు. రైతులకు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.

రూ.7,645 కోట్లకు పైగా సాయం

ఈసారి 94 వేల మందికి చెందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల ప్రకారం ఉన్న 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. మొత్తంగా ఈ సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులకు కోటి 52 లక్షల 91 వేల ఎకరాలకు సాయం అందిస్తున్నామన్నారు. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున 7,645 కోట్ల 66 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించామన్నారు. యాసంగి సీజన్‌లో లబ్ధిదారుల సంఖ్య 66.61 లక్షలకు పెరిగిందని, వారికి రూ.7,645 కోట్లకు పైగా సాయం అందనుందన్నారు.

ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఆరోహణ క్రమంలో..

తక్కువ భూవిస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి ఆరోహణా క్రమంలో సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. ఇవాళ ఒక ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఒక ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతామన్నారు. మంచిరోజు అన్న ఉద్దేశంతో శుక్రవారం రోజే పది మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News