Tuesday, April 30, 2024

భారత్ నుంచి వైద్య పరికరాలు కోరిన రష్యా

- Advertisement -
- Advertisement -

 

Russia seeks medical..

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నందుకు రష్యా ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలు సరఫరా చేయాల్సిందిగా రష్యా, భారత్ ను కోరింది. ఈ విషయమై భారత, రష్యా కంపెనీలు ఈ నెల 22న వర్చువల్ సమావేశాన్ని నిర్వహించబోతున్నాయి. భారత్ నుంచి అదనంగా వైద్య పరకరాల సరఫరాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఫోరం కోఆర్టినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. ఇదిలావుండగా రష్యా మార్కెట్‌లో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఎగుమతులను ఈ ఏడాది 10 రెట్లు పెంచి 2 బిలియన్ల రూపాయలు(26.2 బిలియన్ డాలర్లు)కు చేరుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని రాజీవ్ నాథ్ తెలిపారు. యూరప్, చైనాల నుంచి రష్యాకు దిగుమతులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నందుకు రష్యా పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కూడా భారత్ రష్యాతో యథావిధిగా సంబంధాలు కొనసాగిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా సహా పశ్చిమదేశాల గుర్రును భారత్ ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News