Sunday, May 5, 2024

భాష అనేది సమస్య కాదు

- Advertisement -
- Advertisement -

Sai Manjrekar is starring in movie 'Major'

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలీవుడ్ హీరోయిన్స్ రాక ఇంకా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా తెలుగు సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు. కానీ కొందరు మాత్రమే అనుకోకుండా వస్తారు సెటిల్ అవుతుంటారు. కొందరు కావాలని వచ్చినా అదృష్టం లేక వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్‌లోకి వస్తోంది యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్. ఈ 22 ఏళ్ల కుర్రభామ సౌత్ డెబ్యూనే పాన్ ఇండియా మూవీతో చేస్తోంది. అడవిశేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘మేజర్’ అనే బయోపిక్ మూవీతో ఎంట్రీ ఇవ్వనుంది ఈ భామ. అయితే ఈ సినిమా తెలుగుతో పాటు వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు తాజాగా తెలుగు సినిమాలు ఒప్పుకోవడానికి కారణం ఏంటని అడిగితే క్రేజీగా సమాధానం చెప్పింది. సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ “నేను తెలుగు సినిమాలు ఒప్పుకోవడానికి కారణం మా నాన్న (డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్). ఆయనే సౌత్ వైపు ప్రయత్నించమని ప్రోత్సాహించారు. అలాగే నాకు భాష తెలియదు కాబట్టి తెలుగు సినిమా చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ అయితే మా నాన్న చెప్పారు.. మనకు భాష అనేది సమస్య కాదు… మన నటన మాట్లాడాలని చెప్పేసరికి ఓకే అన్నాను. ప్రస్తుతం నా నిర్ణయం కరెక్ట్ అని హ్యాపీగా ఉన్నాను”అని చెప్పింది. సయీ మంజ్రేకర్ ‘మేజర్’తో పాటుగా వరుణ్ తేజ్ సరసన గని సినిమాలో నటిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News