Sunday, April 28, 2024

నన్ను నేను సవాల్ చేసుకున్నట్లుగా అనిపించింది

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవితో ఇంటర్వూ…
కొత్తగా అనిపించింది…
దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఈ లోకం కొత్తగా అనిపించింది. నాటి పరిస్థితులు గురించి తెలుసుకుంటున్నపుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్న భావన కలిగింది. ఇప్పుడు అందరికీ స్వేఛ్చ వుంది. నాటి పరిస్థితులు, సమయం గురించి దర్శకుడు వేణు చాలా విషయాలు చెప్పారు.
సవాలు చేసుకున్నట్లుగా…
తెలియని కథ చేయడంలో మజా వుంటుంది. తెలిసిన కథ మళ్ళీ మళ్ళీ చేస్తే కొత్తగా ఉండదు. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తే నటిగా కూడా మెరుగవుతాను. నన్ను నేను సవాల్ చేసుకున్నట్లు ఉంటుందని ‘విరాట పర్వం’ చేశాను.
నిజాయితీగా రాశారు…
ఇసుకతో బొమ్మ తయారు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. ఆయుధంగా కూడా మలుచుకోవచ్చు. వెన్నెల పాత్ర కూడా అలానే అనిపించింది. వెన్నెల ఒక తెల్ల కాగితం. దానిపై ఏది రాస్తే అదే ఆమె అవుతుంది. దర్శకుడు ఆ పాత్రని చాలా నిజాయితీగా రాశారు. ఈ సినిమాలో నక్సలిజం నేపథ్యంలో ప్రేమ కథ ఒక ప్రయాణం. వెన్నెల పాత్రలో ఒక అమాయకత్వం వుంటుంది. తను నమ్మే దాన్ని సాధించే తెగువ వుంటుంది.
గొప్ప ఆనందాన్నిచ్చింది…
రానా స్టార్ డమ్, స్థాయి, ఆయనకి వున్న వాయిస్‌కి రవన్న పాత్ర గొప్పగా సరిపోతుందనిపించింది. రానా వచ్చిన తర్వాత ‘విరాట పర్వం’ స్కేల్ మారిపోయింది. ఆయన ఈ ప్రాజెక్ట్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.
ఇది మంచి అనుభూతి…
ప్రియమణి, నందితా దాస్ నటనతో ప్రేరణ పొందుతాను. ‘విరాట పర్వం’లో వారితో కలిసి నటించినప్పుడు ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదు. కానీ ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఫ్రేంలో వారితో నేను వున్నానా అనే ఫీలింగ్ కలిగింది. ఇది మంచి అనుభూతి.

Sai Pallavi Interview about Virata Parvam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News