Sunday, May 5, 2024

సౌందర్య బయోపిక్

- Advertisement -
- Advertisement -

ఇటీవల కాలంలో బయోపిక్ అనేది స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతోంది. కొందరు వాస్తవాలను దగ్గరగా చూపిస్తూ ఉంటే మరికొందరు కమర్షియల్ హంగులతో కల్పిత కథలను అల్లుతున్నారు. ఇక త్వరలో సౌత్ ఇండియన్ బ్యూటీఫుల్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ కూడా వెండితెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి, ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’లతో పాటు ఇంకా కొన్ని జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చి వారి వారి అభిమానులను అలరించాయి. అలాగే ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సౌందర్య జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయింది. అయితే ఈ బయోపిక్ లో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, సౌందర్యపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సహజ నటిగా సౌందర్య సాధించిన ఘనతలను కూడా ఆమె బయోపిక్ లో భాగం చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ లో అన్ని అంశాలను పెట్టారట దర్శకనిర్మాతలు. అయితే ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.

Sai Pallavi to play as Soundarya in Biopic?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News