Saturday, May 11, 2024

మొదటిసారి రూల్స్ బ్రేక్ చేశా

- Advertisement -
- Advertisement -

Samantha acted in Family Man 2 web series

 

స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. అందుకే సీజన్ 2లో నటించేందుకు సమంత ఒప్పుకుంది. హిందీ ప్రేక్షకుల ముందుకు సమంత మొదటిసారిగా ఈ వెబ్‌సిరీస్‌తో వెళ్లనుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఆమె పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదిగా కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఆమధ్య తన పార్ట్‌కు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లుగా ఆమె చెప్పింది. తెలుగు, తమిళం, హిందీల్లో ఆమె డబ్బింగ్ చెప్పింది. తాజాగా మరోసారి ఈ వెబ్ సిరీస్ గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఓటీటీ ప్లాట్ ఫామ్ అనేది రూల్స్‌ను బ్రేక్ చేసే విధంగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌తో మొదటిసారి నేను రూల్స్‌ను బ్రేక్ చేశాను. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నా పాత్రను చూసి అంతా సర్‌ప్రైజ్ అవుతారు”అని సమంత పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News