Friday, April 26, 2024

కంగనా రనౌత్ ఇన్‌స్టా పోస్ట్‌కు సమంత లైక్

- Advertisement -
- Advertisement -

Dhaakad

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధాకడ్’ త్వరలో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్నది. ఈ సినిమాలో కంగనా గూఢచారిగా కనిపించబోతున్నది. విభిన్న గెటప్పుల్లో అభిమానుల మనస్సులు చూరగొననుంది. ఏజెంట్ అగ్నిగా ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ధాకడ్’ సినిమా 2022 ఏప్రిల్ 8న విడుదల కాబోతున్నట్లు కంగనా తన పోస్ట్ ద్వారా తెలిపింది. దీనిపై టాలీవుడ్ నటి సమంత స్పందించింది. కామెంట్ సెక్షన్‌లో ఫైర్ ఎమోజీని జత చేసింది. అంతేకాక కంగనా పోస్‌కు లైక్ కూడా పెట్టింది. హిందీ నటుడు ఆమిర్ ఖాన్ కారణంగానే నాగచైతన్య, సమంత విడిపోయారంటూ ఈ మధ్య కాలంలో కంగనా కామెంట్ చేసి సంచలనం రేకెత్తించింది. తప్పంతా నాగచైతన్యదేనని విమర్శించింది. మహిళా సాధికారతకు ప్రతిరూపంగా సమంతను అభివర్ణించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News