Tuesday, April 30, 2024

సమీర్ వాంఖడే పుట్టుకతోనే ముస్లిం

- Advertisement -
- Advertisement -

Sameer Wankhede is a Muslim by birth

బోగస్ పత్రాలతో ఉద్యోగం పొందారు : మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్

ముంబయి: ఎన్‌సిబి ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్‌వాంఖడే పుట్టుకరీత్యా ముస్లిం అని, నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉగ్యోగం పొందారన్న తన మాటలకు కట్టుబడి ఉన్నానని మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సిపి నేత నవాబ్‌మాలిక్ స్పష్టం చేశారు. క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌సహా 20మందిని అరెస్ట్ చేసిన ఆపరేషన్‌లో సమీర్‌వాంఖడే కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్ అంతా బోగస్ అని మాలిక్ విమర్శిస్తున్నారు.

2015 నుంచి వాంఖడే కుటుంబసభ్యులు తమ పేర్లు మార్చుకుంటున్నారని మాలిక్ అన్నారు. సమీర్ తండ్రి దావూద్ వాంఖడే తన పేరును డికె వాంఖడేగా, సమీర్ సోదరి యాస్మీన్ వాంఖడే జాస్మిన్‌గా పేరు మార్చుకున్నారని మాలిక్ అన్నారు. ముస్లిం అయిన తన భర్తకు విడాకులిచ్చిన జాస్మిన్ ప్రస్తుతం యూరప్‌లో ఉంటున్నారని మాలిక్ తెలిపారు. సమీర్ పుట్టుకతోనే ముస్లిం అని మాలిక్ అన్నారు. ముస్లిం మతంలోకి మారింది సమీర్ కాదని, ఆయన తండ్రి అని మాలిక్ అన్నారు. వాంఖడేలు మత మార్పిడికి పాల్పడలేదని షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్‌హల్దార్ అనడాన్ని మాలిక్ విమర్శించారు. హల్దార్ బిజెపి నేతలా వ్యవహరిస్తున్నారని, ఆయన రాజ్యాంగబద్ధ పదవికి నియామకం పొందారని మాలిక్ అన్నారు. వాస్తవాలను పరిశీలించి పార్లమెంట్‌కు నివేదిక ఇవ్వాలని మాలిక్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News