Monday, May 6, 2024

సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతలకు సర్వే

- Advertisement -
- Advertisement -

Harish Rao became a member of the key GoM

సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాల సర్వేకు గ్రీన్ సిగ్నల్
ఈ నెల 12న పనుల ప్రారంభాకిని ముహూర్తం ఖరారు
సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్: సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ఎత్తిపోతల పథకాల సర్వే పనులకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు ఈనెల 12న సర్వే పనులు ప్రారంభించనున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు సాగునీరందించే ఈ ఎత్తిపోతల పథకాల పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు మంగళవారం నాడు అరణ్యభవన్‌లోని తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో సర్వే పనులు ఈ నెల 12న ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మూడు నియోజకవర్గాల పరిధిలో 2.19లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఇందులో సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో 57వేల ఎకరాలు, ఆందోల్ నియోజకవర్గంలో 56వేల ఎకరాలు , జహీరాబాద్ నియోజకవర్గంలో లక్షా ఆరు వేల ఎకరాలకు సాగునీరందించాలని లక్షంగా పెట్టకున్నారు.

ఈ ప్రాజెక్టులో రెండు పంప్ హౌస్‌లను నిర్మించనున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి హరీశ్ రావు వివరించారు. మొదటి పంపు ద్వారా ఐదులాపూర్ నుండి వెంకటాపూర్ డెలివరి సిష్టం వరకూ సుమారు 125మీటర్ల ఎత్తున నీటిని ఎత్తి పోయనున్నట్టు తెలిపారు. ఈ డెలివరి సిస్టం నుండి జహీరాబాద్, హద్నూర్, కంది కెనాల్స్ ద్వారా దాదాపు 2.19లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నట్టు వివరించారు. ఈ పనుల ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు విపులంగా చర్చించారు. రెండవ లిప్ట్‌ను జహీరాబాద్ కెనాల్ పై హతికుర్డు నుంచి గోవిందాపూర్ వరకు సుమారు 40మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నట్టు అధికారులు వివరించారు. మొత్తం 2.19లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రణాళికలో భాగంగా రెండవ లిఫ్ట్ ద్వారా సుమారు 42వేల ఎకరాలకు నీరిందిస్తామని తెలిపారు. రెండవ లిఫ్ట్ ద్వారా మొగుడంపల్లి, జహీరాబాద్, మండలాలకు నీరందుతుందని వివరించారు. సర్వే పనులు వేగంగా చేపట్టాలని మంత్రి హరీశ్ రావు నీటిపారుదల శాఖ అధికారులను, కన్సల్టెంట్ ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు.
20టిఎంసీల నీటి కేటాయింపు:
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కోసం శ్రీసాయి గణేష్ అసోసియేషన్, బసవేశ్వర ఎత్తిపోతల పథకం కోసం ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ సంస్థలకు సర్వే పనులకు సంబంధించిన టెండర్లు అవార్డయ్యాయి. సింగూరు ప్రాజెక్టుకు కుడి, ఎడమ వైపుల ఏర్పాటు చేసే ఈ లిప్టులు సింగూరు ప్రాజెక్టు నుంచి 20టీఎంసిల నీటిని ఎత్తిపోసి మొత్తం నాలుగు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయనున్నాయి. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆంధోల్ నియోజకవర్గాల్లో నిర్ధేశిత ఆయకట్టుకు సాగునీరందనుంది. ఇందులో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 2.19లక్షల ఎకరాలు, బసవేశ్వర ఎత్తిపోతల ఎత్తిపోతల పథకం కింద 1.65లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాల సర్వేపనులకు రూ.27కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో సంగమేశ్వర పథకం సర్వేకు రూ16కోట్లు, బసవేశ్వర ఎత్తిపొతల పథకం సర్వే పనులకు రూ.11కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ రెండు లిప్టుల కింద తొలుత కొంతమేరకు నీటిని ఎతిపోసి, ఆ తర్వాత గ్రావిటీ కెనాల్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందించేలా డిజైన్లను రూపకల్పన చేయనున్నట్టు అధికారలు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సీఈ విజయకుమార్ ఎస్‌ఈలు మురళీధర్, సుబ్రమణ్య ప్రసాద్, మధుసూధన్ రెడ్డి, కన్సల్టెంట్ ఏజెన్సీ ప్రతినిధి బి. మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News