Monday, May 6, 2024

ముఖ్యమంత్రి చిత్రపటానికి బల్దియా కార్మికులు క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

Sanitation Workers

 

హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విశిష్ట సేవలందిస్తున్న జిహెచ్‌ఎంసి పారిశుద్ద కార్మికులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.7500 ప్రత్యేక ప్రోత్సాహకం ప్రకటించడంతో శానిటేషన్, ఎంటమాలజీ, డిఆర్‌ఎపి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధ్యనవాదాలు తెలపుకున్నారు.

గత సోమవారం రాత్రి నుంచే బల్దియాలోని శానిటేషన్, ఎంటమాలజి, డి.ఆర్.ఎఫ్ కార్మికులు ఎక్కడికక్కడ సిఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. బల్దియాలో శానిటేషన్ విభాగంలో 22,500 మంది, ఎంటమాలజీ విభాగంలో 2,375 మంది, ఎన్‌ఫోర్స్‌మెంట్,విజిలెన్స్ విభాగంలో 1100 మందితో కలిపి మొత్తం 27వేల పై చిలుకు కార్మికులు విధులను నిర్వహిస్తున్నారు. వీరందరికీ ఏలాంటి కోతలు లేని వేతనంతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకం సైతం అందజేయడంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

బల్దియా కార్మికుల కృషి ఎనలేనిది 
కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభణతో అభివృద్ది చెందిన దేశాలే గజగజవణికిపోతున్న తరుణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిహెచ్‌ఎంసి శానిటేషన్ విభాగం కార్మికులు చేస్తున్న కృషి ఎనలేనిదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. వారి అమూల్యమైన సేవలను గుర్తించి వారికి పూర్తి వేతనంతోపాటు రూ.7500లు ప్రత్యేక ప్రోత్సాహకంను ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అయన కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాయలంలో కార్మికులు నిర్వహించిన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మిగితా మున్సిపాలిటీ కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకం కిందరూ.5వేలు ప్రకటించగా జిహెచ్‌ఎంసి కార్మికులకు రూ.7500లను ఇవ్వడం పట్ల సిఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నన్నారు. అదేవిధంగా ఈ ప్రత్యేక ప్రోత్సాహకం మంజూరుకు కృషి చేసిన పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Sanitation Workers Happy with Incentives
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News