Thursday, May 9, 2024

సర్వాయి పాపన్నగౌడ్ సాంస్కృతిక వారసత్వమే కల్లుఘటం సాకబోనం

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: గోల్కొండ కోటలో 10వ కల్లు ఘఠం సాకబోనం వేడుకలు తెలంగాణ ఐక్యసాధన సమితి రాష్ట్రాధ్యక్షులు అంబాల నారాయణగౌడ్, వర్కింగ్ అధ్యక్షులు బబ్బూరి భిక్షపతి గౌడ్‌ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ హాజరై మాట్లాడుతూ 365 ఏండ్లక్రితం సర్థార్ సర్వాయి పాపన్నగౌడ్ గొల్కోండ కోటలో కల్లు ఘఠంసాక బోనాన్ని ప్రారంభించారని తెలిపారు. కోటలో రేణుక ఎల్లమ్మకు గుడికట్టి, సబ్బండవర్గాలకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన సామాజిక విప్లవకారడు పాపన్న అన్నారు.

ఆ సాంస్కృతికి వారసత్వంగా నేడు గౌడ ఐక్యసాధన సమితి గత 10 ఏండ్లుగా బోనాలు చె ల్లించడం హర్షించదగిన విషయమన్నారు. అనంతరం వేడుకలకు హాజరైన సబ్బండ వర్గాల ప్రజలంతా కలసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ వే డుకల్లో బీసి కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, గౌడ సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, పల్లె లక్ష్మణ్‌గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, పోన్నం నారాయణగౌడ్, బింగి ఇందిరమ్మగౌడ్, వేములయ్య గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News