Sunday, April 28, 2024

జైలు శిక్ష మినహాయింపునకు శశికళ వినతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అవినీతి ఆరోపణలపై నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత సన్నిహితురాలు వికె శశికళ సత్ప్రవర్తన కింద తనకు శిక్షను తగ్గించి ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక కోర్టులో రూ. 10 కోట్ల జరిమానాను ఇటీవలే డిపాజిట్ చేసిన శశికళ శిక్షాకాలం వచ్చే ఏడాది జనవరి 27వ తేదీతో ముగిసే అవకాశం ఉంది. ఆమె ప్రస్తుతం ఇక్కడి పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా.. అంతకన్నా ముందే తనను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె కోరినట్లు అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఆమె దరఖాస్తును పైఅధికారులకు నివేదించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న ఖైదీకి సత్ప్రవర్తన కింద నెఎలకు మూడు రోజుల మినహాయింపు లభిస్తుంది. ఆ ప్రకారం చూస్తే 43 నెలలో జైలులో ఉన్న శశికళకు 135 రోజుల జైలు జీవితం మినహాయింపు లభించాల్సి ఉంటుంది.

Sasikala’s Applies for exemption from imprisonment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News