Thursday, May 16, 2024

ది క్లాసిక్ మాన్యుఫాక్చరింగ్ – 2 యూనిట్ ను ప్రారంభించిన సత్యవతి

- Advertisement -
- Advertisement -

Satyavathi rathode launches The Classic Manufacturing - 2 unit

హైదరాబాద్: మహబూబాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ లో అంచెలంచెలుగా ఎదిగి, పారిశ్రామికవేత్తగా విజయం సాధించిన వెంకన్నకు, సినిమా రంగంలోనూ విజయం సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా నివాసి, పారిశ్రామిక వేత్త తల్లాడ వెంకన్న సంస్థ ది క్లాసిక్ మాన్యుఫాక్చరింగ్- 2 యూనిట్ ను హైదరాబాద్ లోని నాచారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం తల్లాడ వెంకన్న ప్రధాన పాత్రలో నటించిన నమస్తే సేట్ జీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి రామ సత్యనారాయణ, నాచారం ఐల చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News