Saturday, May 4, 2024

ముస్లిం యువతి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చా?…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పెద్ద మనిషి అయ్యాక(ఆఫ్టర్ ప్యూబర్టీ) ముస్లిం యువతి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చునని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’ పెట్టుకున్న వినతిని పరిశీలించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. 15 ఏళ్లు నిండిన ముస్లిం యువతి వ్యక్తిగత చట్టం ప్రకారం చట్టబద్ధమైన, చెల్లుబాటు అయ్యే వివాహం చేసుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును మరే ఇతర కేసులోనూ ఆధారంగా తీసుకోరాదని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, జస్టిస్ పిఎస్. నరసింహలతో కూడిన ధర్మాసనం హర్యానా ప్రభుత్వంతోపాటు ఇతరులకు నోటీసులు జారీచేసింది. కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావును ‘అమికస్ క్యూరీ’గా నియమించింది.

‘మేము ఈ రిట్ పిటిషన్లను స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నాము. నోటీసు జారీ చేయండి. తదుపరి ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు నిర్దోషిత తీర్పును ఇదివరకటి తీర్పుగా పరిగణించకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది.
14,15,16 ఏళ్ల వయస్సున్న ముస్లిం యువతులకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ‘పర్సనల్ లాకు రక్షణ ఉంటుందా? క్రిమినల్ నేరానికి వ్యతిరేకంగా మీరు సంప్రదాయం, పర్సనల్ లా ఆధారంగా వాదించగలరా?’ అని ఆయన ప్రశ్నించారు. ఇస్లాంలోని పర్సనల్ లా ప్రకారం ఆడపిల్ల యుక్త వయస్కురాలు(ప్యూబర్టీ) అయ్యే వయస్సు 15 సంవత్సరాలు.

తన 16 ఏళ్ల భార్యను పంచకులలోని చిల్డ్రన్స్ హోంలో నిర్భందించి ఉంచడాన్ని సవాలు చేస్తూ ఓ 26 ఏళ్ల వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దానికి పంజాబ్,హర్యానా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ‘ముస్లిం యువతికి 15 ఏళ్లు నిండితే ఆమె ప్యూబర్టీకి చేరినట్లు… తన ఇష్టానుసారం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, అలాంటి పెళ్లి బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 సెక్షన్ 12 కింద చెల్లకుండా పోదు’ అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News