Friday, April 26, 2024

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై బదులివ్వండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జెబి పార్థివాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం తమ స్పందనను ఫిబ్రవరి 15లోగా తెలియజేయాలని, పిటిషన్లపై తుది విచరాణ మార్చి నుంచి ప్రారంభమవుతుందని సరోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ అంశంపై ఢిల్లీ విభిన్న తీర్పులను ఇవ్వడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతేడాది 11న వైవాహిక అత్యాచారానికి సంబంధించిన కేసులో హైకోర్టు రెండు విరుద్ధ తీర్పులను ప్రకటించింది. అయితే తమ తీర్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు జస్టిస్ రాజీవ్ శక్దీర్, జస్టిస్ సి అనుమతిస్తున్నట్లు అదేరోజు తెలిపారు. ద్విసభ్య బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ శక్దీర్ అత్యాచార మినహాయింపును రాజ్యాంగ కొట్టివేయడానికి మొగ్గు చూపారు.

అయితే వైవాహిక అత్యాచారం మినహాయింపు రాజ్యాంగ విరుద్ధం కాదని జస్టిస్ హరిశంకర్ అన్నారు. ఈ తీర్పుపై కుష్బూ సైఫీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా భర్త భార్యపై అత్యాచారం, అసహజ శృంగారం వంటి ఆరోపణల నుంచి మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ముందు సమానత్వం)కి విరుద్ధమని కర్ణాటక హైకోర్టు గతేడాది మార్చి 23న పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వీటితో మరికొన్ని ఇతర పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. పిటిషనర్లు వైవాహిక అత్యాచారాన్ని పీనల్ కోడ్ సెక్షన్ 375 ప్రకారం రేప్ నుంచి మినహాయించడాన్ని సవాల్ చేశారు. భర్తల చేతిలో లైంగికదాడికి గురవుతున్న భార్యలపై వివక్ష చూపడమే అని పిటిషన్లు పేర్కొన్నారు. కాగా మైనరు కాని భార్యతో భర్త శృంగారం ఐపిసి సెక్షన్ 375 ప్రకారం అత్యాచారం కాదని చట్టం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News