Friday, May 10, 2024

స్కూల్ టీచర్ అరెస్ట్ నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా

- Advertisement -
- Advertisement -

మన్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) : ఛత్తీస్‌గఢ్ లోని మొహ్లామన్‌పూర్‌అంబగర్ చౌకీ జిల్లాలో మావోయిస్టుల మద్దతుదారుడన్న ఆరోపణపై 25 ఏళ్ల స్కూల్ టీచర్‌ను పోలీస్‌లు అరెస్టు చేయడం కరెకట్ట గ్రామస్థుల ఆందోళనకు దారి తీసింది. టీచర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిటగాన్ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులతోసహా ధర్నా చేపట్టారు. కరేకట్ట గ్రామంలో రామ్‌లాల్ నురేటి అనే స్కూల్ టీచర్‌ను పోలీస్‌లు శనివారం అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్15 న మావోయిస్టు పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించడంలో ప్రమేయం ఉందని స్కూల్ టీచర్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

నిందితుడు సిటగావ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని మహకా గ్రామానికి చెందినవాడు. కాంట్రాక్ట్ పై కరెకట్ట గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా నియామకమయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్ 15న మదన్‌వాడ ఏరియా లో మావోయిస్టులు ఉద్యమానికి పిలుపు ఇచ్చే సందర్భంగా ఈ బ్యానర్లు ప్రదర్శించారు. ఇందులో స్కూల్ టీచర్ ప్రమేయం ఉందని పోలీస్‌లు కనుగొన్నారు. అరెస్టు చేసి రాజ్‌నందగావ్ జిల్లా జైలుకు తరలించారు. దీనిపై గ్రామస్థులు సిటగావ్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News