Saturday, May 4, 2024

వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచుతాయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని, తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రం ప్రకాశ్ నగర్ లోని సెయింట్ జోసెఫ్ పాఠశాల వేదికగా జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Science fairs develop skills in children

అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదికగా నిలుస్తాయని అన్నారు. చిన్న పిల్లలు అయినా గొప్ప ఆలోచనలతో తమ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రదర్శనలలో పాల్గొన్నారని వారందరినీ ప్రశంసించారు. ఆవిష్కరణలు అనేవి ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చేవిగా ఉండాలని అప్పుడే ప్రజలకు ఉపయోగ పడటమే కాకుండా అవిష్కరణలకు గుర్తింపు వస్తుందన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ప్రజల సమస్యల పరిష్కారానికి సులువైన యాంత్రిక పరికరాలు ఉపయోగపడే విధంగా ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు.

Science fairs develop skills in children

ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా పరిష్కరించే విధంగా నూతన ఆవిష్కరణలు అవిష్కరిస్తే తగిన గుర్తింపు పొందుతారని తెలియజేశారు. పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు వారికి కొత్త ఆలోచనలకు నాంది అన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భవిష్యత్‌లో కొత్తదనంతో ప్రయోగాలను ప్రదర్శించడానికి విద్యార్థులు ఆసక్తి చూపించడానికి మంచి వేదిక అన్నారు. ఇలాంటి ప్రదర్శనలకు విద్యార్థులను ఉపాధ్యాయులు తగిన ప్రోత్సహం అందించాలని, సైన్స్‌, గణితం విషయాలకు సంబంధించిన ప్రయోగాలతో వారికి కావాల్సిన సలహాలు అందిస్తే వారి నైపుణ్యాన్ని మరింత పదును పెట్టే మంచి ఆలోచనలకు పునాదులు వేస్తారని అన్నారు.

Science fairs develop skills in children

అనంతరం విద్యార్థులు రూపొందించిన సుమారు 478 ప్రదర్శనలు వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించారు. విజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని అద్భుత ఆవిష్కరణలు చేసిన చిన్నారులందరికీ అభినందనలు తెలిపారు. 50వ జవహర్‌లాల్‌ నెహ్రూ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన-2022ను జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌ ఎన్విరాల్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌ ఈ సారి నుంచి రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనగా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, సూడా చైర్మన్ విజయ్, డిఇఒ, ఎంఇఒ లు, ఉపాద్యాయులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News