Saturday, May 4, 2024

కుర్చీ కోసం కుమ్ములాట

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, డిప్యూ టీ సిఎం శివకుమార్‌లు దీనిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ మంత్రులు, ఎంఎల్‌ఎలు ముఖ్యమంత్రి పీఠంపై తమ మనసులోని కోరికను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర, ఐటి శాఖ మంత్రి, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేలు సైతం సి ఎం పీఠంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కలిసి వస్తే తాను ముఖ్యమంత్రినవుతానని పరమేశ్వర అంటే, అధిష్ఠానం అడిగితే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక ఖర్గే అంటున్నారు. పరమేశ్వరను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని మరో మంత్రి కెఎన్ రాజణ్ణ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ పరమేశ్వర తన మనసులోని కోరికను బైటపెట్టారు. తుంకూర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజణ్ణ మాట్లాడుతూ, పరమేశ్వర ఈ రోజు హోంమంత్రిగా ఉన్నారని, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చని అన్నారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజు ల్లో ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం కలిసి వస్తుందని తాను బ లంగా నమ్ముతున్నానని అన్నారు. అంతేకాదు అదృష్టం కలిసి వచ్చేలా తామంతా కృషి చేస్తామని ఆయన అన్నారు. పరమేశ్వర ముఖ్యమంత్రి అయితే తామంతా కూడా ముఖ్యమంత్రి అయినంతగా సంతోషిస్తామని రాజణ్ణ అన్నారు. దీనిపై పరమేశ్వర స్పందిస్తూ తాను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించిన రాజణ్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ అదృష్టం కలిసి రావాలని తాను కూడా కోరుకుంటున్నానని అన్నారు. అయితే తాను ఎ ప్పుడు ముఖ్యమంత్రినవుతానో తనకు తెలియదని ఆయన అం టూ ముఖ్యమంత్రి కాదగ్గ అర్హత ఉన్న వాళ్లు చాలామంది పార్టీ లో ఉన్నారని, వారందరికీ అవకాశం దక్కితే బాగుంటుందన్నా రు. మరో వైపు శుక్రవారం విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు ప్రి యాంక ఖర్గే సమాధానమిస్తే అధిష్ఠానం అడిగితే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ‘ సిఎం పదవిని చేపట్టాలని హైకమాండ్ అడిగితే నేను సరేనంటాను’ అని ఖర్గే అన్నారు. ‘నలుగురు వ్యక్తులు ఢిల్లీలో కూర్చుని సిఎం ఎవరో నిర్ణయిస్తారు. ఆ నలుగురు తప్ప వేరెవరు ఏం మాట్లాడినా విలువ ఉండదు. ఒక వేళ హైకమాండ్ నువ్వు ముఖ్యమంత్రి అని అంటే నేను సరేనంటా’నని ప్రియాంక ఖర్గే అన్నారు. దీంతో ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలు కర్నాటక రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరో వైను కర్నాటక ప్రభుత్వాన్ని కూల్చడానికిరాష్ట్ర బిజెపి నాయకులకు అమిత్ షా వెయ్యి కోట్లు ఇచ్చారని ప్రియాంక ఖర్గే ఆరోపించారు.అంతకు ముందు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పార్టీ మారితే రూ.50 కోట్ల నగదు, మంత్రి పదవి ఇస్తామని కొందరు బిజెపి నాయకులు ఆశ చూపించారని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రవికుమార్ గనిగరోపించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఖర్గే సైతం ఇదిదే తరహా ఆరోపణలు చేడం గమనార్హం.శుక్రవారం డిప్యూటీ సిఎం శివకుమార్ సైతం బిజెపిపై విమర్శలు చేశారు. కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మాట్లాడుతూ రాష్ట్రం లో అధికార మార్పు ప్రసక్తే లేదని, అయిదేళ్లూ తానే సిఎంగా ఉంటానని స్పష్టం చేశారు. కాగా మరో వైపు ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోదరుడు, లోక్‌సభ సభ్యుడు డికె శివకుమార్ కూడా ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేనప్పుడు ఊహాజనితమైన ప్రశ్నలపై చర్చించడంలో అర్థం లేదని సురేశ్ అన్నారు. ‘కర్నాటక ప్రజలు కాంగ్రెస్‌కు పాలించడానికి అయిదేళ్లు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం సాఫీగా సాగేలా చూసే బాధ్యత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌లపై ఉంది’ అని కూడా ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News