Monday, April 29, 2024

అదానీహిండెన్‌బర్గ్‌పై సెబీ దర్యాప్తులో జోక్యం కుదరదు

- Advertisement -
- Advertisement -

సెబీ ఇచ్చిన క్లీన్‌చిట్ సమర్థనీయమేనని తేల్చి చెప్పిన సుప్రీం
దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదని
స్పష్టీకరణ మిగిలిన రెండు కేసుల విచారణను మూడు నెలల్లో
పూర్తి చేయాలని సెబీకి ఆదేశం షేర్‌హోల్డర్లకు జరిగిన నష్టాలపై
కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని సుప్రీం కోర్టు
త్రిసభ్య ధర్మాసనం సూచన

సిట్, సిబిఐకి అప్పగింత అనవసరం, హిండెన్‌బర్గ్ రిపోర్టు వ్యాజ్యాలపై సుప్రీం తీర్పు
అధీకృత సంస్థ దర్యాప్తు సవ్యమే, మూడునెలల్లో మిగిలిన దర్యాప్తు, షేర్‌హోల్డర్లకు నష్టాల ఆరాకు ఆదేశాలు

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌హిండెన్‌బర్గ్ వ్యాజ్యంలో బుదవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ అంశానికి సంబంధించి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెలువరించిన క్లీన్‌చిట్ సమర్థనీయమే అని తేల్చిచెప్పింది. సెబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని, దర్యాప్తును సిట్‌కు లేదా సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రముఖ వ్యాపారవేత్త మిలియనీర్ గౌతమ్ అదానీకి ఆయన కంపెనీలకు భారీ స్థాయి విజయంగా మారింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం వెలువరించిన తీర్పులో ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సిట్ లేదా సిబిఐ దర్యాప్తు అవసరం లేదని తెలిపారు. వేరే దర్యాప్తు క్రమం కోసం ఆదేశించే ప్రాతిపదికలు ఏమీ కనబడటం లేదని ధర్మాసనం పేర్కొంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లెర్ హిండెన్‌బర్గ్ పరిశోధనా సంస్థ ఒసిసిఆర్‌పి అదానీ సంస్థలపై పలు కీలక ఆరోపణలతో వెలువరించిన నివేదిక హిండెన్‌బర్గ్ రిపోర్టుగా నిలిచి వివాదాస్పదం అయింది. దీనిపై దాఖలు అయిన పలు పిటిషన్ల విచారణ తరువాత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఒసిసిఆర్‌పిని బిలియనీర్ జార్జ్ సోరోస్ ఇతరులు తమ నిధులతో ఏర్పాటు చేశారు.హిండెన్‌బర్గ్ కేసులో సెబీ దర్యాప్తు సక్రమమే అయినప్పుడు దీనిపై అపనమ్మకాలు అవసరం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. హిండెన్‌బర్గ్ వెలువరించిన ఆరోపణల సంబంధిత అంశాలపై మొత్తం 24 అంశాలలో సెక్యూరిటిస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆప్ ఇండియా (సెబీ) 22 అంశాలపై దృష్టి సారించింది. అదానీ షేర్ల వ్యవహారాలు అన్ని సక్రమంగానే ఉన్నాయని సెబీ తెలిపింది. సెబీ సంబంధిత విషయాలలో అధీకృత సంస్థగా ఉంది. ఈ సంస్థ నిర్థారణ క్రమంలో జోక్యం చేసుకునే పరిధి అధికారం కోర్టుకు లేదని తెలిపారు. పార్లమెంట్‌లో నిర్ధేశిత చట్టం ద్వారా కొన్ని విధివిధానాలను రూపొందించడం జరిగింది. సంబంధిత చట్టాలు, నిబంధనలు ( డెలిగేటెడ్ లెజిస్లేషన్ లేదా సెకండరీ లెజిస్లేషన్) అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదని తెలిపారు. ఈ తీర్పు దశలో చీప్ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ పిటిషనర్లు తమ వాదనలకు వార్తా పత్రికల కథనాలు, థర్ట్‌పార్టీ అయిన వ్యవస్థీకృత నేరాల అదుపు రిపోర్టింగ్ సంస్థల నివేదికలపై ఆధారపడి వాదనలకు దిగితే అవి చెల్లనేరవని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు 46 పేజీల తీర్పు వెలువరించింది. సెబీ వంటి సంస్థల దర్యాప్తుల్లో సుప్రీంకోర్టు జోక్యం అత్యంత అసాధారణ సందర్భాలలోనే జరుగుతుంది. అధీకృత సంస్థ కొట్టొచ్చే , ఉద్ధేశపూరిత రీతిలో వేరే విధంగా దర్యాప్తునకు పాల్పడినట్లు అయితే, దీనిని నిర్థారించగలిగితే అప్పుడు న్యాయస్థానాలు ఇందులో జోక్యం చేసుకునేందుకు స్పందించేవీలుంటుందని తెలిపారు. సెబీ దర్యాప్తు నివేదికను సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. సెబీ దర్యాప్తు ఈ సంస్థ వల్ల ఈ సంస్థ సమగ్ర దర్యాప్తు తీరుతెన్నుల పట్ల నిర్థిష్టరీతిలో విశ్వాసం ఏర్పడిందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదిక క్రమంలో భారతీయ షేర్‌హోల్డర్లు ఎవరైనా నష్టాలకు గురి అయి ఉన్నట్లు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని ఆదేశించారు. హిండెన్‌బర్గ్ నివేదిక క్రమంలో ఇతర కంపెనీలు ఏమైనా స్టాక్‌మార్కెట్ అంతర్గత వ్యవహారాలలో అక్రమరీతిలో చొరబడి, తమ అనుకూల వాతావరణానికి స్పందించారా? అనేది కూడా తేల్చాల్సి ఉందని తెలిపారు.
మిగిలిన రెండు కేసుల విచారణకు మూణ్నెళ్ల గడువు
సెబీ ఇప్పటివరకూ వదిలేసిన మిగిలిన రెండు అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు, విచారణను మూడు నెలల వ్యవధిలో ముగించాలని తీర్పులో స్పష్టం చేశారు. ఆరోపణల క్రమంలో హిండెన్‌బర్గ్ స్టాక్ మార్కెట్ వ్యవహారాలలో జోక్యం చేసుకున్నట్లా ? నిబంధనలను ఉల్లంఘించారా? అనేది తేల్చాల్సి ఉందని , దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సెబీని, ప్రభుత్వాన్ని ఆదేశించారు. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, షేర్ల విలువలను ఎక్కువగా చూపిందని, ఖాతాల్లోనూ మోసాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రిపోర్టు ఇవ్వడం దేశంలో తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రధాని మోడీ అదానీకి తరచూ అండగా ఉంటున్నారని, అక్రమాల విషయంలో మోడీ పాత్ర నిర్థారణ జరగాల్సి ఉందని కాంగ్రెస్ ఇతర విపక్షాలు డిమాండ్ చేశాయి.
సత్యమే గెలిచింది : గౌతమ్ అదానీ
సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై గౌతమ్ అదానీ స్పందించారు. నిజం నిరూపితం అయింది. ధర్మం జయించిందని, తమ సంస్థల ద్వారా దేశ ప్రగతికి తాము మరింతగా సేవలు అందిస్తామని తెలియచేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పుతో సత్యమేవ జయతే నానుడి నిర్థారితం అయిందని తెలిపారు. తమకు అండగా నిలిచిన వారికి అందరికీ ధన్యవాదాలని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News