Friday, April 26, 2024

పాఠశాలల్లో రెండవ రోజు పెరిగిన హాజరు శాతం

- Advertisement -
- Advertisement -

Second day increased attendance percentage in schools

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన రెండవ రోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు 9.81 శాతం అధికంగా హాజరు నమోదైంది. మంగళవారం 32.47 శాతం హాజరు నమోదు కాగా,బుధవారం 42.28 శాతం విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధికంగా 44.24 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా, ఎయిడెడ్ పాఠశాలల్లో 33.84 శాతం, ప్రైవేట్ స్కూళ్లలో 40.93 శాతం హాజరు నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా 38,307 పాఠశాలల్లో 55,42,038 విద్యార్థులు ఉన్నారు. రెండవ రోజు 23,43,205 మంది హాజరయ్యారు. పలు ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. అత్యధికంగా కొమురం భీరం 53.05 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరు కాగా..వనపర్తి జిల్లాలో అతి తక్కువగా 26.55 శాతం హాజరు నమోదైంది. మరో రెండు మూడు రోజుల్లో విద్యార్థుల సంఖ్య హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

తెరుచుకోని ప్రైవేట్ పాఠశాలలు 585

రాష్ట్రంలో రెండవ రోజు కూడా 585 ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోలేదు. మొత్తం 10,837 ప్రైవేట్ స్కూళ్లు ఉండగా, బుధవారం నాటికి 10,252 పాఠశాలలు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ పాఠశాలలు అన్నీ కలిపి మొత్తం 38,307 పాఠశాలలు ఉండగా, తొలి రోజు 37,647 స్కూళ్లు తెరుచుకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News