Tuesday, May 7, 2024

బిఆర్‌కె భవన్‌లో ఒక్కరికి కరోనా…. సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్

- Advertisement -
- Advertisement -

Secretariat employee corona positive

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ఉన్న బిఆర్‌కె భవన్‌లో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక శాఖలో పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి కరోనా సోకడంతో ఏడో అంతస్థులో ఉన్న సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. సిబ్బంది కుటుంబాలను హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణలో 24 గంటల్లో 154 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిహెచ్‌ఎంసి (132), రంగారెడ్డి(12), మేడ్చల్(3), యాదాద్రి భువనగిరి(2), సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా 14 మంది చనిపోయారు. తెలంగాణలో 3650 మందికి కరోనా వైరస్ వ్యాపించగా 137 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1742 మంది కోలుకోగా 1771 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News