Saturday, May 4, 2024

మద్యం మత్తులో కారు డ్రైవింగ్

- Advertisement -
- Advertisement -

Secunderabad Club manager killed in accident at Madhapur

హైదరాబాద్: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతి, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన నగరంలోని మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 1.15నిమిషాలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….సికింద్రాబాద్ క్లబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న గౌతం దేవ్(33), అతడి భార్య శ్వేతశ్రావణి మాదాపూర్ నుంచి కొండాపూర్‌కు బుల్లెట్ బైక్‌పై వెళ్తున్నారు. బైక్‌పై వస్తుండగా మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న జంక్షన్‌లో గ్రీన్ సిగ్నల్ ఉండడంతో ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఐకియా నుంచి బెంజ్ కారులో వస్తున్న ఇద్దరు స్నేహితులు కాశీవిశ్వనాథ్, కౌశిక్ మద్యం మత్తులో కారు నడుపుకుంటూ వస్తు సిగ్నల్ జంప్ చేసి వచ్చి బైక్‌ను ఢీ కొట్టారు. గౌతం దేవ్ అక్కడికక్కడే మృతిచెందగా, అతడి భార్య శ్వేత పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే బాధితురాలిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాశీవిశ్వనాథ్ కారు నడుపుతున్నాడు. సంఘటన జరిగిన వెంటనే ఇద్దరు స్నేహితులు కారు అక్కడే వదిలేసి పారిపోయారు. ఇద్దరు ఓయో హోటల్‌లో తలదాచుకున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. కాశీవిశ్వనాథ్ గతంలో కూడా మద్యం తాగి కారు నడపడంతో అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ఎపిలోని ఎమ్మెల్యే కాటసాని ఓబుల్ రెడ్డిదిగా గుర్తించారు. కారు యజమానికి నోటీసులు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. గౌతం దేవ్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలుః విసి సజ్జనార్, సైబరాబాద్ సిపి

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. పబ్బుల్లో మద్యం తాగే వారిని క్షేమంగా ఇంటి వద్ద దింపే బాధ్యత పబ్బుల యజమానులదేనని తెలిపారు. ఇక నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. పబ్బుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News