Thursday, May 16, 2024

అన్నారం బ్యారేజీకి ముప్పులేదు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో అంతర్భాగమైన అన్నారం సరస్వతి బ్యారేజీలో ఎలాం టి బుంగ ఏర్పడలేదని శాఖ కు చెందిన అన్నారం బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.యాదగరి వెల్లడించారు. బుధవారం నాడు అన్నారం బ్యారేజీకి ప్రమాదం జరిగిందన్న వదంతులను ఇఇ కొట్టిపడేశా రు. గోదావరి నదిపైన అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీలో సహజంగా పెర్మెబుల్ ఫౌండేషన్స్‌లో వస్తున్న నీరే తప్ప ఆ నీ టితో పాటు ఎలాంటి ఇసుక రేణువులు రా వడం లేదని తెలిపారు. ఫ్రెష్ వాటర్ పరిమితికి లోబడే వస్తున్నాయన్నారు. ఎఏ సీపేజ్ వలన బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అన్నారం బ్యారేజ్ భద్రతకు ఢోకా లేదన్నా రు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి సంవత్సరం సహజంగా బ్యారేజీ ఆపరేషన్ మెయింటినెన్స్ (ఒ అండ్ ఎం )పనులు చేపడతామని తెలిపారు.

బ్యారేజీలో 1275 మీటర్ల పొడవులో రెండు చోట్ల సీపేజ్ ఉందన్నారు. అయితే ఎక్కడ కూడా ఇసుక రావడం లేదని తెలిపారు. ఇరిగేషన్ శాఖతో పాటుగా బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ల మధ్య కాంట్రాక్టు ఉంటుందన్నారు. డిఫెక్ట్ లయబులిటీ కాలంలో బ్యారేజీ నిర్వహణ బాధ్యత వాళ్లదే అని వెల్లడించారు. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్, ఫిల్టర్ వేస్తున్నామన్నారు. ఇసుకతో రింగ్ బండ్ కూడా వేస్తున్నామని తెలిపారు. బ్యారేజి నిర్వహణలో భాగంగా ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుందని వివరించారు. ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపెజ్ వాటర్ పోవడానికి డిజైన్లోనే ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ విధమైన ఏర్పాట్లు బ్యారేజీలో డిజైన్ మాన్యువల్స్ ప్రకారం ఉండడం బ్యారేజీ సేఫ్టీ దృష్ట్యా అవసరం కూడా అని తెలిపారు .అన్నారం బ్యారేజి నుంచి నీటి సీపేజి సమస్యను నివారించేందకు అవసరమయితే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తాం అని అన్నారం బ్యారేజీ ఈఈ యాదగరి స్పష్టం చేశారు.

అన్నారం బ్యారేజీపై ప్రకటన విడుదల:
అన్నారం బ్యారేజికి సంబంధించిన సమాచారంతో ప్రాజెక్టు అధికార వర్గాలు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపైన అన్నారం వద్ద 10.87టిఎంసీల నీటి నిలువ సామర్ధంతో సరస్వతి బ్యారేజిని నిర్మించారు. ఈ బ్యారేజికి మొత్తం 66గేట్లు అమర్చారు. బుధవారం ఉదయం బ్యారేజి రెగ్యులర్ మెయింటినెన్స్‌లో భాగంగా ఇంజనీర్లు 38వ వెంట్ వద్ద నీటి సీపేజిని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై సీపేజిని అరికట్టేందుకు ఇసుకబస్తాలను అడ్డుగా వేశారు. ఇక్కడ ఎటువంటి బుంగ ఏర్పడ లేదని, ఈ సీపేజి సర్వసాధారణమే అని అధికారులు వెల్లడించారు. డిఇఇ రవిచంద్ర ఉదయం నుంచి అన్నారం బ్యారేజి వద్దనే ఉంటూ రెగ్యులర్‌గా బ్యారేజి నిర్వహణలో బాగంగా సిపేజిని గుర్తించి ఇసుక బస్తాలతో దాన్ని నిరోధించారని అధికారులు వెల్లడించారు.

అన్నారం గ్రామానికి చెందిన 20మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏవిధమైన అనుమతులు తీసుకోకుండా అన్నారం బ్యారేజిమీదకు దూసుకు వచ్చారని తెలిపారు. బ్యారేజి 38వ గేటు వద్ద వీడియోలు , ఫోటోలు తీసి బయటి వ్యక్తులకు బుంగ ఏర్పడిందని ప్రచారం చేశారని తెలిపారు. బ్యారేజిలో సీపేజి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అన్నారం , సుందిళ్ల బ్యారేజిలలో నిల్వ ఉన్న నీటి మట్టాలను తగ్గిస్తూ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు రామగుండం ఎస్‌ఇ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News