Friday, April 26, 2024

కివీస్‌తో తలపడే టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

సౌతాంప్టన్ : న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడే టీమిండియాను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సమరం కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే సౌతాంప్టన్ చేరుకుంది. భారత్‌కివీస్ జట్ల మధ్య శుక్రవారం నుంచి డబ్లూటిసి ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును మంగళవా రం ఎంపిక చేశారు. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా, అజింక్య రహానె వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఓపెనర్లుగా ఊహించినట్టే శుభ్‌మన్ గిల్, రోహిల్ శర్మలను ఎంపిక చేశారు. కాగా, వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్‌తో పాటు వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇచ్చారు. వీరి లో తుది జట్టులో ఎవరికీ స్థానం దక్కుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది. తెలుగుతేజం హను మ విహారికి కూడా ఈ ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కింది. ఆల్‌రౌండర్ల కోటాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో సీనియర్లు ఇషాంత్, బుమ్రా, షమి, ఉమేశ్ యాదవ్‌లతో పాటు హైదరాబాదీ యువ సంచలనం మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు.
మయాంక్‌కు నిరాశే..
మరోవైపు ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌కే స్థానం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే జట్టు యాజమాన్యం మాత్రం మయాంక్‌కు బదులు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కే మొగ్గు చూపింది. ఇక మయాంక్ ను ఎంపిక చేయాలని భారత్‌కు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు సూచించిన విషయం తెలిసిందే. వీరితో పాటు విదేశీ ఆటగాళ్లు సయితం మయాంక్‌కే అవకాశం ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు. కానీ బిసిసిఐ మాత్రం శుభ్‌మన్ గిల్‌కే ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.
విహారికి ఛాన్స్..
తెలుగుతేజం హనుమ విహారి కూడా ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడే జట్టులో చోటు సంపాదించాడు. లోకేశ్ రాహుల్‌ను కాదని జట్టు యాజమాన్యం విహారికే ఛాన్స్ ఇచ్చింది. కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో విహారి నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో అతనికే ఫైనల్‌లో పాల్గొనే అవకాశం లభించింది. మరోవైపు వికెట్ కీపర్లుగా ఇద్దరిని ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత రిషబ్‌పంత్‌కు మా త్రమే ఛాన్స్ ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సీనియర్ వికెట్ కీపర్ సాహాను కూడా జట్టుకు ఎంపిక చేశారు. దీంతో వీరిలో తుది జట్టులో స్థానం ఎవరికీ దక్కుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్ కూడా జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో సిరాజ్‌కు స్థానం లభించింది. సీనియర్లు బుమ్రా, ఉమేశ్, షమి, ఇషాంత్‌లతో పాటు సిరాజ్‌ను ఫాస్ట్ బౌలర్‌గా అవకాశం ఇచ్చారు. ఇక శార్దూల్ ఠాకూర్‌ను ఫైనల్ సమరానికి ఎంపిక చేయలేదు.

జట్టు వివరాలు

విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, బుమ్రా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News