Tuesday, May 7, 2024

ఆ పబ్బులపై చర్యలు తీసుకుంటాం: సిపి

- Advertisement -
- Advertisement -

Serious action on pubs

 

హైదరాబాద్: పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి అంజనీకుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడారు. కొన్ని పబ్బులపై ఫిర్యాదులు వచ్చాయని, పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని సూచించారు. మైనర్లకు మద్యం అమ్మే బార్లు, పబ్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని, రూల్స్ పాటించకుండా అర్థరాత్రి వరకు నడిపే పబ్‌లపై నిఘాపెట్టామన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సిపి అన్నారు. పిల్లలకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వొద్దన్నారు. పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News