Saturday, May 4, 2024

పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ తెలిపారు. డిజిపి కార్యాలయంలో ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాల్లోని పరిస్థితులు, సహాయ కార్యక్రమాలపై అదనపు డిజిలు శివధర్‌రెడ్డి, సంజయ్‌కుమార్ జైన్, విజయ్‌కుమార్, సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిపి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడితే శాటిలైట్ ద్వారా పరిశీలించి పోలీస్ అధికారులు సమాచారం ఇస్తున్నామని తెలిపారు.

వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ద్వారా తెలుసుకుని జిల్లాల్లోని పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అడిషనల్ డిజి లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్ తదితర అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2,900మందిని రక్షించామని, వారిని పునరావాస కేంద్రానికి తరలించామని తెలిపారు. మోరంచపల్లి గ్రామంలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించామని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని కోరారు.

హైదరాబాద్ మూడు పోలీస్ కమిషనరేట్లలో పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ముసారాంబాగ్ బ్రిడ్జిపై వరద కంట్రోల్‌లో ఉందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెల్పీలు తీసుకునేందుకు జలపాతాలు, మత్తడిపోస్తున్న చెరువులు , పారుతున్న కాలువల వద్ద వెళ్తున్నారని, వారిని వెళ్లకుండా చూడాలని కోరారు. విద్యుత్ స్థంబాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 24 గంటల పాటు డిజిపి కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్త పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News