Friday, May 10, 2024

శిల్పాచౌదరికి బెయిల్…అయినా జైల్లోనే

- Advertisement -
- Advertisement -

మూడు కేసుల్లో ఒక కేసులో బెయిల్ మంజూరు

Police to open shilpa chaudhary bank lockers today
మనతెలంగాణ/హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టయిన శిల్పాచౌదరికి ఒక కేసులో గురువారం నాడు ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురు మహిళలు తమను శిల్పా చౌదరి రూ.7 కోట్ల మేర మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో దివ్యారెడ్డి ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్ మంజూరైంది. మరో రెండో కేసుల్లో శిల్పా చౌదరికి బెయిల్ లభించలేదు. అధికవడ్డీల పేరిట మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరిపై నమోదైన మూడు కేసుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరు కాగా మిగిలిన రెండు కేసుల్లో బెయిల్ రానందున ఆమె జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి ఇప్పటికే మూడు పర్యాయాలు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం వదితమే. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాల ప్రకారం శిల్పా చౌదరిని పోలీసులు ఒక్క రోజు కస్టడీకి తీసుకుని బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాకు సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. అదేవిధంగా ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న మొత్తాలు ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. విచారణలో భాగంగా ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషించడంతో పాటు ఏడాది కాలంగా వారిద్దరూ కలిసి ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడారనే వివరాలను సేకరిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News