Friday, April 26, 2024

శివశంకర్ మాస్టర్ కు కరోనా… ఆరోగ్య పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నాలుగు రోజుల క్రితం శివశంకర్ కరోనా సోకడంతో ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తిలకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకడంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉందని ఎఐజి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శివశంకర్ భార్య, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడుకు కూడా కరోనా వైరస్ సోకింది. పెద్ద కుమారుడు ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయన భార్య హోంక్వారంటైన్‌లో ఉండి చికత్స తీసుకుంటున్నాడు. శివశంకర్ వివిధ భాషలలో 800 చిత్రాలకు పైగా డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. పలు భాషల్లో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. మగధీర సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్ అవార్డు వరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News