Friday, May 3, 2024

ఫిలడెల్ఫియాలో కాల్పులు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో బులెట్ ప్రూఫ్ కోటు వేసుకున్న సాయుధుడైన వ్యక్తి సోమవారం రాత్రి కాల్పులకు పాల్పడడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీస్ కమిషనర్ డేనియల్లే అవుట్‌లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడు బులెట్ ప్రూఫ్ కోటు వేసుకుని , ఎఆర్ టైప్ రైఫిల్ , చేతి తుపాకీ, పోలీస్ స్కానర్ లతో ఉన్నాడని చెప్పారు.

Also Read:  భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్ మద్దతుదారుల దుశ్చర్య

ఈ సమయంలో తమకు తెలిసింది ఒకటేనని, ఈ వ్యక్తి ఇంటిని విడిచిపెట్టే ముందు వ్యక్తులను టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోందని వివరించారు. బాల్టిమోర్‌లో వీకెండ్ పార్టీలో కాల్పులకు ఇద్దరు చనిపోయిన సంఘటన తరువాత ఈ హత్యలు జరగడం గమనార్హం. ఈ ఏడాది ఫిలడెల్ఫియాలో హింసాత్మక సంఘటనలు విపరీతంగా జరిగాయి. మొత్తం ఇంతవరకు సామూహిక హత్యల సంఘటనలు 29 వరకు జరిగాయి. 2006 నుంచి ఇలాంటి సామూహిక హత్యల సంఘటనలు 550 వరకు జరిగాయని డేటా చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News