Tuesday, April 30, 2024

కర్నాటకలో బోనీ కపూర్ కారు కలకలం

- Advertisement -
- Advertisement -

39 లక్షల విలువైన వెండివస్తువుల స్వాధీనం

బెంగళూరు : ప్రముఖ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌కు చెందిన కారును కర్నాటకలో నిలిపివేసి తనిఖీలు చేయగా అందులో విలువైన వెండి వస్తువులను కనుగొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల దశలో ఇప్పుడు కోడ్ అమలులో ఉంది. ఎన్నికల సంఘం అధికారులు సంబంధిత సిబ్బంది సాయంతో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా దావణగేరే శివార్లలోని హెబ్బలు టోల్‌గేట్ వద్ద చెక్‌పోస్టు వద్ద కారులో తనిఖీ చేయగా 66 కిలోల వెండి గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు ఉన్నట్లు గుర్తించారు.

వీటి విలువ రూ 39 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్ సుల్తాన్‌ఖాన్‌తో పాటు కారులో ఉన్న హరిసింగ్ ఇతరులపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయి ఉంది. హరిసింగ్‌ను విచారించగా ఈ వెండి వస్తువులు బోనీకపూర్ కుటుంబానికి చెందినవే అని తెలిపారు. అయితే వీటికి సంబంధించి సరైన పత్రాలు చూపలేకపోవడంతో వీటిని స్వాధీనపర్చుకున్నారు. తనిఖీల దశలో కారులో బోనీ ఉన్నారా? లేదా? అనేది అధికారులు నిర్థారించలేదు.

అయితే ఈ దశలో కారులో లేరని, కానీ వెండి వస్తువులతో ఈ కారు చెన్నై నుంచి ముంబైకి కర్నాటక మీదుగా వెళ్లుతోందని గుర్తించారు. ఎన్నికలలో పార్టీలు ఎక్కువగా వెండి భరిణెలు, గిన్నెలు, బంగారుతాలిబొట్లు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని పసికట్టి ఇసి బృందాలు కలియతిరుగుతున్న దశలో బోనీకపూర్ కారులో వెండి వస్తువులు దొరకడం సంచలనం అయింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News