Saturday, April 27, 2024

చాలా బోల్డ్‌గా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

Simrat Kaur says about her role in dirty Hari

 

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ సిమ్రత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను జాస్మిన్ అనే అమ్మాయిగా నటించాను. చాలా బోల్డ్‌గా నేను కనిపిస్తా. ఇందులో డిఫరెంట్‌గా నా పాత్ర ఉంటుంది. పెద్ద నిర్మాత అయిన ఎం.ఎస్.రాజు…. ప్రభాస్, మహేష్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. మరి అలాంటి వ్యక్తితో ఓ సినిమా చేయడమనేది చాలా గొప్ప విషయమని నేను అనుకుంటున్నాను. ఇక ఓ నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. కానీ ఒక స్పోర్ట్స్ రోల్‌లో చేయాలనేది నా డ్రీమ్‌”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News