Sunday, April 28, 2024

ఓవర్ బర్డెన్ ఇసుక తయారీపై దృష్టి సారించిన సింగరేణి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యావరణహిత మైనింగ్ చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ మరో వినూత్నమైన పర్యావరణహిత చర్యగా ఓవర్ బర్డెన్ నుంచి నుండి ఇసుక తయారీ చేసే 2 ప్లాంట్లను నెలకొల్పింది. సింగరేణి భూగర్భ గనుల్లో బొగ్గును తొలగించిన తర్వాత ఏర్పడిన ఖాళీలను ఇసుకతో నింపుతుంటారు. దీనినే ’శాండ్ స్టోయింగ్’ అంటారు. ఇప్పటి వరకూ దీనికోసం గోదావరి నది ఇసుకను కంపెనీ వినియోగిస్తోంది. ఇందుకు గాను ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఇసుకను గోదావరి నది నుండి తీసుకోవాల్సి వస్తోంది. అయితే సింగరేణి తన పర్యావరణహిత చర్యల్లో భాగంగా నదుల ఇసుకకు బదులుగా ఓవర్ బర్డెన్ (మట్టి) నుండి ఇసుకను తయారు చేస్తూ దానిని శాండ్ స్టోయింగి వినియోగిస్తూ వస్తోంది. 201314లో సింగరేణిలో గల ఈ తరహా ప్లాంట్‌ల ద్వారా కేవలం 1,09,761 క్యూబిక్ మీటర్ల ఇసుక తయారు చేశారు. సంస్థ ఉన్నతాధికారుల ప్రత్యేక చొరవతో కొత్త ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు.

2014 నుంచి నేటి వరకు సింగరేణి తయారు చేసిన ఓవర్ బర్డెన్ ఇసుక వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయిః
2014-15 లో 1.09 లక్షల క్యూబీక్ మీటర్ల ఓబీని ఇసుక తయారు కాగా, 2015-16లో 3.68 లక్షల క్యూబిక్ మీటర్లు, 2016- 17లో 6.8 లక్షల క్యూబిక్ మీటర్లు 2017-18లో 5.53 లక్షల క్యూబిక్ మీటర్లు, 2018-19లో 5.52 లక్షల క్యూబిక్ మీటర్లు 201920లో 2.73 క్యూబిక్ మీటర్లు,202021లో 4.09 లక్షల క్యూబిక్ మీటర్లు, ఇసుకను తయారు చేశారు.

నదుల ఇసుక వాడకాన్ని తగ్గించేందుకు ఓవర్ బర్డెన్ నుండి ఇసుక తయారు చేశారు. 2021-22 లో 5.82 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తయారు చేసింది. 2022-23 లో 4.6 లక్షల క్యూబిక్ మీటర్లు మొత్తం మీద ఇప్పటి వరకు 38.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తయారు చేసి, ఈ మేరకు నదుల ఇసుక వాడకాన్ని తగ్గించింది. సింగరేణి చేపట్టిన ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన పర్యావరణహిత చర్యగా గుర్తింపు పొందింది. ప్రముఖ ఇనిస్టిట్యూట్  ఆఫ్ డైరెక్టర్స్ ఇండియా సంస్థ ఈ ప్రక్రియకు ‘గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ / సర్వీస్’ అవార్డు 2015ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News