Friday, May 3, 2024

నేటి నుంచి ఆరు బ్యాంకుల లోగోలు మారతాయ్

- Advertisement -
- Advertisement -

bank logos

 

న్యూఢిల్లీ: నేటి నుంచి పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం అమల్లోకి రానున్న తరుణంలో వాటి లోగోలు మారతాయి. ఈ బ్యాంకుల విలీనానికి శనివారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పిఎన్‌బి(పంజాబ్ నేషనల్ బ్యాంక్) బ్రాంచ్‌లలో కలుస్తాయి. సిండికేట్ బ్యాంక్ వచ్చే నెల నుంచి కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లలో కలవనుంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లుగా మారతాయి. అలహాబాద్ బ్యాంక్ శాఖలు ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో కలవనున్నాయి. దీంతో నాలుగు అతిపెద్ద బ్యాంకుల అవతరణ జరగనుంది.

ఈ విలీనంతో ఏడు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు మిగలనున్నాయి. 2017లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. ఏడు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల సృష్టితో దేశవ్యాప్తంగా సేవలందిస్తాయని, ఇవి ఒక్క సంస్థ దాదాపు రూ.8 లక్షల కోట్ల వ్యాపారంతో సేవలందిస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది. ఎస్‌బిఐ వ్యాపారం రూ.52 లక్షల కోట్లకు పైగా ఉండగా, ఆ తర్వాత పిఎన్‌బి వ్యాపారం రూ.17.94 లక్షల కోట్లుగా ఉండనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మూడో అతిపెద్ద బ్యాంక్‌గా మారనుండగా, తర్వాతి స్థానాల్లో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్‌లు ఉండనున్నాయి.

 

Six bank logos will change from today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News