Monday, April 29, 2024

కూలీలు, కార్మికులకు బియ్యం, నగదు అందజేత

- Advertisement -
- Advertisement -

rice

 

గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మందికి పంపిణీ
ప్రతి మనిషికి 12కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ n 1200 మెట్రిక్ టన్నుల బియ్యం, విలువ రూ.3.93 కోట్లు, నగదు రూ.50 కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఊరు కాని ఊరు… అయినవారి అందరికీ దూరంగా కొంత మంది కుటుంబాలతో మరికొంత మంది ఒంటరిగా బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస బాటపట్టారు. ఉపాధి దొరకడమే కాకుండా తనతో పాటు కుటుంబం సైతం ఓ మాదిరి బతుకుతున్న సమయంలో హఠాత్తుగా కరోనా వైరస్ రూపంలో ఉపాధి దూరమై బతుకు భారమై ఏలా జీవించాలనే ఆందోళనతో శతమతమవుతున్న లక్షలాది మంది కార్మికులకు మేం ఉన్నామంటూ అభయ హస్తం అందిస్తోంది ప్రభుత్వం.

లాక్‌డౌన్ నేపథ్యంలో పనులతో సంబంధం లేకుండా మళ్లీ మామూలు పరిస్థితి వచ్చేంత వరకు అసంఘంటిత రంగాల కార్మికులు, కూలీలకు కడుపు నిండ భోజనంతో పాటు కనీస అవసరాల ఖర్చు నిమిత్తం నగదును సైతం అందజేస్తోంది. ఈ కూలీలు ఇక్కడ పని చేయడం ద్వారా కేవలం తమ కుటుంబాలను మాత్రమే పోషించుకోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో సైతం భాగస్వామ్యం అవుతున్న వీరందరినీ అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అదేశాల మేరకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

గ్రేటర్‌లో లక్షమంది కార్మికులకు బియ్యంతో పాటు నగదు వివిధ పనుల నిమిత్తం నగరంలో పని చేస్తున్న పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు, కూలీలకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల నిమిత్తం నగదు పంపిణీ చేపట్టింది. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసిలోని అర్బన్ కమ్యూనిటి డవలప్‌మెంట్, టౌన్ ప్లానింగ్, విభాగాలతో పాటు రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులతో కూడిన ఏర్పాటు బృందాలు వలస కూలీల గుర్తింపు పూర్తి చేశాయి. జిల్లాలో వారీగా (గ్రేటర్ హైదరాబాద్ 34, 283, రంగారెడ్డి జిల్లా 37, 894, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా 14,411, వికారాబాద్ 6288, సంగారెడ్డి జిల్లా 22,231) వలస కార్మికులున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. అయితే ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు అత్యంత సమీపంలో ఉన్న శివారు ప్రాంతాల నిర్మాణ రంగంతో పాటు వివిధ రంగాల్లో 948 ప్రదేశాల్లో దాదాపు 95,859 మంది కార్మికులు పని చేస్తున్నట్లు ఈ బృందాలు గుర్తించాయి.

ఇందులో నిర్మాణ రంగలో వివిధ రాష్ట్రాలకు చెందిన 41,740 మంది 284 ప్రదేశాలలో పని చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. 41,740 కూలీలతో పాటు మిగిలిన 54వేలపై చిలుకు కార్మికులకు కార్పొరేటర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీసు, పౌర సంబంధాల శాఖల బృందాల ద్వారా ఉన్నతా పోలీసు అధికారులు ఆర్‌డిఓలు, తహసీల్దార్లు, సమక్షంలో ప్రతి కార్మికుడికి 12 కిలోల చొప్పున బియ్యంతో పాటు కుటుంబంలో ఎంత మంది ఉంటే వారందరికీ రూ.500ల చొప్పున నగదు పంపిణీని ప్రారంభించారు. ఈ పంపిణీ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేలా, ప్రతి కార్మికుడికి బియ్యంతో పాటు నగదు అందేలా ఈ ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా బల్దియా అదనపు కమిషర్ ఎన్.యాదగిరి రావుతో పాటు సహాయ అధికారిగా రవీందర్‌రెడ్డిలను నియమించారు. సోమవారం రాత్రి లాంఛనంగా కొంత మందికి కూలీలకు బియ్యంతో పాటు నగదును అధికారులు అందజేశారు. కూలీలకు, కార్మికులకు బియ్యంతో పాటు నగదు పంపిణీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు.

ఈ కేంద్రాల ద్వారా మంగళవారం ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎవరూ గుంపులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్న అధికారులు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా నగర శివారు ప్రాంతాల సర్కిళ్లలో సైబరాబాద్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌తో పాటు ఆర్‌డిఓ చంద్రకళ నేతృత్వంలో నిర్మాణ స్థలాలకే స్వయంగా వెళ్లి అక్కడ నివాసముంటున్న కూలీల కుటుంబాలకు 25 కిలోల బియ్యం బస్తాలు, నగదును అందజేశారు. అదేవిధంగా పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌లు ముషీరాబాద్‌లోని జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం వలస కూలీలు, కార్మికులకు బియ్యంతో పాటు నగదును పంపిణీ చేశారు.

 

Provided rice and cash to workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News