Wednesday, May 1, 2024

విద్యుదాఘాతంతో ఆరు ఎద్దులు మృతి

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు: విద్యుదాఘాతంతో ఆరు ఎద్దులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నల్లచెరువు గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం భారీగా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది.

ఉదయం గ్రామానికి చెందిన కట్ట అంజయ్య రెండు ఎద్దులు, కట్ట సాంబయ్య ఎద్దు, కట్ట యాదయ్య ఎద్దు, కట్ట పోశయ్య చెందిన రెండు ఎద్దులు మేత కోసం సమీపంలోని వ్యవసాయ పొలాలలోనికి వెళ్ళాయి. విద్యుత్ స్తంభం నేలకొరిగి భూమిపై విద్యుత్ తీగలు పడి ఉండడంతో ఎద్దులకు తీగలు తగలడంతో అక్కడికక్కడే ఆరు ఎద్దులు మృత్యువాత పడినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సిఐ డి.కృష్ణమోహన్ సందర్శించారు. ఒకేసారి ఆరు ఎద్దులు మృత్యవాత పడడంతో రైతుల రోదనలు మిన్నంటాయి. బాధిత రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరారు.

ఐక్యతా ఫౌండేషన్ సాయం: విద్యుదాఘాతంతో ఎద్దులు మృత్యువాత పడ్డ రైతులను ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు పరామర్శించారు. ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒక్కో ఎద్దుకు 5వేల చొప్పున 30 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News