Saturday, May 11, 2024

రెట్టింపు ఊరట

- Advertisement -
- Advertisement -

corona

 

3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి
జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి
24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు
ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయని కేంద్రం హెచ్చరిక
వణుకుతున్న ముంబయి
3032కు కేసులు, మహారాష్ట్రలో ఒక్క రోజే 466 పాజిటివ్‌లు
53 మంది జర్నలిస్టులకు వైరస్, ఐసొలేషన్‌లోకి మేయర్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెట్టింపు కావడానికి పడుతున్న వేగం భారత్‌లో మందగించింది. లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతుండగా ఇప్పుడది 7.5 రోజులకు చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి భ యపెడుతున్న వేళ కేసుల రెట్టింపు వేగం తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తున్న అంశం కావ డం గమనార్హం. జాతీయ సగటుతో పోల్చితే తెలుగు రాష్ట్రాలు మిన్నగా ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. గడచిన 24గంట ల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1553 కేసులు న మోదైనాయని, లవ్ అగర్వాల్ చెప్పారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య17,265కు చేరుకుందని ఆయన చెప్పారు. గత 24 గంటల్లో 36 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారిలో 2,546 మంది కోలుకున్నారని, మొ త్తం కేసుల్లో ఇది 14.75 శాతమని, మొత్తం 543 మంది మరణించారని చెప్పారు.

దేశం లో కరోనా రెట్టింపు వేగం తగ్గుముఖం పడుతోందని లవ్ అగర్వాల్ చెప్పారు. ఈ నెల 19 వరకు 18 రాష్ట్రాల్లో జాతీయ స్థాయికన్నా త క్కువ రెట్టింపు రేటు ఉందని చెప్పారు. కేరళ, కర్నాటకలలో ఈ రెట్టింపు వేగం బాగా తగ్గిందని చెప్పా రు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రెట్టింపు వేగం జాతీ య స్థాయితో పోలిస్తే తక్కువగా ఉండడం గమనార్హం. తెలంగాణలో 9.4 రోజులకు రెట్టింపు అవుతుండగా, ఎపిలో 10.6 రోజులకు రెట్టింపు అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రేటు 8.5 రోజులుగా ఉందన్నారు. ఒడిశాలో ఈ రేటు 39.8 రోజులుగా ఉండగా, కేరళలో 72.2 రోజులుగా ఉందని తెలిపారు. పుదుచ్చేరిలోని మాహె, కర్నాటకలోని కొడగు,ఉత్తరాఖండ్‌లోని పౌడి గఢ్వాల్ జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని అగర్వాల్ చెప్పారు. 14 రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాని జిల్లాలు దేశంలో 59 ఉన్నాయని చెప్పారు. గోవాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు లేవని, ప్రస్తుతం ఆ రాష్ట్రం కోవిడ్19ఫ్రీ అని ఆయన తెలిపారు.ఆ రాష్ట్రంలో ఏడుగురు కరోనా బారిన పడగా, అందరూ కోలుకోవడం విశేషం.

అదే బాటలో మణిపూర్
గోవా తర్వాత మరో రాష్ట్రం కూడా కోవిడ్19బారినుంచి బైటపడింది. తమ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని గోవా ప్రకటించిన 24 గంటల్లోనే మణిపూర్ కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. తమ రాష్ట్రంలో కరోనా సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు.

వణుకుతున్న ముంబయి మహానగరం
కరోనా కేసులు అత్యధికంగా ప్రబలుతున్న మహారాష్ట్రలో మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. ముంబయి నగరంలో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 3032కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో ముంబయిలో 308 కేసులు నమోదైనాయి. కరోనా వైరస్‌తో బాధపడుతూ ఏడుగురు మరణించడంతో మృతుల సంఖ్య 139కి పెరిగింది. ఇక మహారాష్ట్రలో గత 24 గంటల్లో 466 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,666కు ఎగబాకింది. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలో 9 మంది ఈ మహమ్మారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 232కు చేరుకుంది. మరోవైపు ఆసియాలోనే అతిపెదద మురికి వాడయిన ముంబయిలోని ధారవిలో కరోనా కలకలం రేపుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో 30 కేసులు బైటపడగా మొత్తం కేసుల సంఖ్య 168కి చేరుకుంది. ఇప్పటివరకు ఇక్కడ 11 మంది చనిపోయారు. కాగా ముంబయి వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ఈ సారి అక్కడి జర్నలిస్టులపైనా పగపట్టింది.

నగరంలోని 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది, బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే వారెవరికీ కరోనా లక్షణాలు లేకపోవడం విశేషం. ఈ నెల 16,17 తేదీల్లో రిపోర్టర్లు, కెమెరామన్‌లను కలుపుకొని 167మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించగా, వీరిలో 53 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరందరినీ ఐసొలేషన్‌లో ఉంచనున్నట్లు అధికారులు చెప్పారు. కాగా, గత అయిదు రోజులుగా తాను కలిసిన కొంతమంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలడంతో ముందు జాగ్రత్తగా ముంబయి మేయర్ కిశోరీ పడ్నేకర్ సోమవారం స్వీయ నిర్బంధంలోని వెళ్లారు. వచ్చే 14 రోజులు ఆమె ఇంటివద్దనుంచే పని చేయనున్నారు. మేయర్ నివాసాన్ని మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేశారు. కాగా మరో ఇద్దరు బిఎంసి డిజాస్టర్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి కూడా కరోనా సోకింది.

 

Slow virus outbreak
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News