Friday, April 26, 2024

స్మార్ట్‌గ్రిడ్‌లతో మంచి ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Smart Grid is Giving Good Results

జీడిమెట్లలో ప్రయోగాత్మకంగా 8వేలకు పైగా మీటర్లు
స్మార్ట్‌గ్రిడ్‌లతో మెరుగైన విద్యుత్ సరఫరా
ఇంటికి సిబ్బంది రాకుండానే బిల్లులు

హైదరాబాద్: స్మార్ట్ గ్రిడ్ మంచి ఫలితాలను ఇస్తోంది. సుమారు రెండు సంవత్సరాల క్రితం జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా 8వేలకు పైగా స్మార్ట్ మీటర్లను జీడిమెట్లలో ఏర్పాటు చేశారు. వీటిని నుంచి మంచి ఫలితం రావడంతో ఈఆర్సీ సంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్ర ఇంధన శాఖ పలు రాష్ట్రాల్లోని డిస్కంల పరిధిలో కొన్ని ఫీ డర్లను స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టును ఎంపిక చేసిన విషయం విధితమే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈసిఐఎల్‌తో కలిసి నగరంలోని జీడిమెట్ల ప్రాం తా న్ని ఎపిక చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 50 శాతం గ్రాంట్ కింద రూ. 4182 కోట్లను కేంద్రం కేటాయించడంతో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో 8800 మీటర్లను ఏర్పాటు చేసింది. వాటి పనితీరును పరిశీలించేందుకు జీడిమెట్లలో 11 కేవీ ఫీడర్లన్నింటిని, ఆటోమెషన్ చేసింది. ఆటో రైక్లోజర్స్, సెక్లనైజర్స్, రింగ్‌మెయింగ్‌న యూనిట్లు ఫాల్ట్‌మేసెజ్ ఇండికేటర్లను ఏర్పాటు చేసింది.

వీటిని పరిశీలించేందుకు వెంగళరావు నగర్‌లోని స్కాడా భవనంలో ప్రత్యేక గ్రిడ్‌ను ఏర్పాటు చేశారు. ఏరోజు ఎక్కడెక్కడ ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాలు వస్తున్నాయి, ఈ విధంగా ప్రతి అంశాన్ని స్కాడా నుంచే పరిశీలిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ పంణీ వ్యవస్థలో ఒక ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోతే ఆ ప్రాంతమంతా విద్యుత్ నిలిచిపోతుంది. కాని స్మార్ట్‌గ్రిడ్ వ్యవస్థలో ఎక్కడ విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తితే అక్కడ వరకు మాత్రమే సరఫరా నిలిచిపోతుంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం యాథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుంది. స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా జీడిమెట్ల ప్రాంతంలో పాత విద్యుత్ మీటర్లను తొలగించి స్మార్టు మీటర్లను ఏర్పాటు చేశారు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ సిబ్బంది ఇంటికి రా కుండానే వినియోగదారులకు బిల్లులు జారీచేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్మార్ట్ మీటర్ల కోసం యాప్‌ను తీసుకు వచ్చే అంశాన్ని కూడా విద్యుత్‌శాఖ పరిశీలిస్తోంది. అంతే కాకుండా ఈ మీ టర్ల నుంచి మంచి ఫలితాలు రావడంతో ఇతర ప్రాంతల్లో వీటిని ఏర్పాటు చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. కరెంట్ వినియోగాన్ని బట్టి పక్కాగా లెక్కకట్టి విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని గతంలోనే సీఎం కేసిఆర్ చెప్పారని అధికారులు చెప్పారు.స్మార్ట్ ,ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు ద్వారా పంపిణీలో జవాబుదారితనం పెరగడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News