Wednesday, May 8, 2024

పాము పంచెలోకి జొరబడి…

- Advertisement -
- Advertisement -

Snake enter into dothi in karimnagar

కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో జెర్రిపోతు ఓ వ్యక్తి పంచెలోకి జొరబడింది. రాజయ్య అనే వ్యక్తి ఎక్కడ పాము కనపడిన వెంటనే పట్టేస్తాడు. పాములు పట్టడంతో రాజయ్య మించిన వారు ఆ గ్రామంలో లేరు. జెర్రొపోతు కనిపించగానే దాని మూతిపై కర్ర పెట్టాడు. ఈ క్రమంలో అతడి కాళ్లను చుట్టుకుంటూ వెళ్లి పంచెలోకి పాము జొరబడింది. తన కాళ్ల నుంచి పామును తీయడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు. అతడి కాళ్లలో నుంచి పామును మరో వ్యక్తి బయటకు తీశాడు. పామును కర్రతో కొట్టి చంపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News