Saturday, April 27, 2024

టోక్యో ఒలింపిక్స్‌: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మహిళా స్విమ్మ‌ర్

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా స్విమ్మ‌ర్ ఎమ్మా మెక్‌కియోన్ రికార్డు నెలకోల్పింది. ఆదివారం జరిగిన మ‌హిళ‌ల 4×100 మీట‌ర్ల సిమ్మింగ్ రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. డిఫెండింగ్ చాంపియ‌న్ అమెరికాను వెనక్కి నెట్టి 3 నిమిషాల 51.60 సెకన్లలో పూర్తి చేసింది. ఈ జట్టులో చెల్సి హాడ్జెస్‌, కేట్ క్యాంప్‌ బెల్‌ల‌తోపాటు మెక్‌కియోన్ కూడా ఉంది. ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో మెక్‌కియోన్ ఖాతాలో మొత్తం 7 మెడ‌ల్స్ చేరాయి. ఇందులో నాలుగు పసిడి, మూడు రజత పతకాలు ఉన్నాయి. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో 7 మెడ‌ల్స్ గెలిచిన తొలి మహిళ స్విమ్మ‌ర్‌గా చరిత్ర సృష్టించింది.

Tokyo Olympics: Australia swimmer win 7 medals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News